ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. చాలా ఏళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూ, చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొచ్చి.. హీరోగా అనుకోకుండా వచ్చిన అవకాశాలను గొప్పగా ఉపయోగించుకుని స్టార్ ఇమేజ్ సంపాదించి ‘మాస్ మహరాజా’గా గుర్తింపు సంపాదించాడు రవితేజ. అతను సంపాదించుకున్న ప్రతి అభిమానీ.. తన టాలెంట్ మెచ్చి ఫ్యాన్ అయిన వాడే.
అంతే తప్ప ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ద్వారానో, పీఆర్ బలంతోనో, డబ్బులు ఖర్చు పెడితేనో రవితేజకు ఎవరూ అభిమానులు కాలేదు. చాలామంది హీరోల్లాగే ఫ్యానిజం విషయంలో సోషల్ మీడియా ద్వారా లేని యుఫోరియాను సృష్టించడం రవితేజ వైపు నుంచి ఎప్పుడూ జరగలేదు.
ఆన్ లైన్లో అయినా, ఆఫ్ లైన్లో అయినా రవితేజ ఫ్యాన్స్ మరీ ఎక్కువ హంగామా చేయరు. తన సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తారు. సినిమా బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు. బాలేకుంటే నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెబుతారు. మంచి ప్రయత్నాలు చేసి ఫెయిలైనపుడు రవితేజకు మద్దతుగా నిలుస్తారు. చెత్త సినిమాలు చేస్తే నిలదీస్తారు.
మామూలుగా రవితేజ సినిమాలు ఫెయిలైనా కూడా తన వరకు అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. అతడి ఎనర్జీ, కమర్షియల్ ఎలిమెంట్లు, ఎలివేషన్లతో మినిమం గ్యారెంటీ వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తుంటాడు. రవితేజ చివరి సినిమా ‘ఖిలాడి’ ఫ్లాపే అయినా.. రవితేజ నుంచి ఆశించే మాస్ అంశాలకు లోటు లేకపోయింది. ఆ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
కానీ మాస్ రాజా కొత్త సినిమా ‘రామారావు: ఆన్ డ్యూటీ’ మాత్రం ఏ రకంగానూ మెప్పించలేకపోయింది. ఇందులో మాస్ రాజా నుంచి ఆశించే అంశాలు ఏమీ లేవు. అతను ఇలా నామమాత్రంగా, నీరసంగా కనిపించిన సినిమాలు దాదాపు కనిపించవు. పోనీ కథాకథనాల్లో దమ్ము ఉండి అవైనా ఎంగేజ్ చేసి ఉంటే.. రవితేజ మార్కు మిస్సయినా సర్దుకుపోయేవాళ్లు అభిమానులు.
కానీ ఈ చిత్రం రెంటికీ చెడింది. దీంతో మాస్ రాజా అభిమానుల ఆగ్రహం అలా ఇలా లేదు లేదు. దర్శకుడు శరత్ మండవను మామూలుగా తిట్టట్లేదు. రవితేజ అభిమానుల నుంచి ఈ స్థాయిలో ఆగ్రహం చవిచూసిన దర్శకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. రవితేజను ముంచావంటూ శరత్‌ను తిట్టడమే కాక.. తమ హీరోను కూడా ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు.
స్టార్ డైరెక్టర్ల వెంట పడకుండా.. కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడం, విరామం లేకుండా సినిమాలు చేస్తూ అభిమానులను అలరించాలని చూడడం, నిర్మాతల శ్రేయస్సు కోరడం.. అంతా బాగానే ఉందికానీ.. స్క్రిప్టుల ఎంపికల జడ్జిమెంట్ బాగా దెబ్బ తింటోందని, ఇకపై సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరికి పడితే వాళ్లకు అవకాశం ఇవ్వొద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు ఫ్యాన్స్.
This post was last modified on July 31, 2022 4:05 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…