వంద రోజులు దాటేశాక కూడా సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ తాలూకు న్యూస్ ఫీడ్ కనిపిస్తోందంటే దానికి కారణం నెట్ ఫ్లిక్స్ దాన్ని పట్టువదలకుండా ప్రమోషన్ చేస్తుండటమే. నాలుగు భాషలు తీసుకున్న జీ5 ఎప్పుడో సైలెంట్ కాగా కేవలం హిందీ వెర్షన్ మాత్రమే కొనుక్కున్న నెట్ ఫ్లిక్స్ తగ్గేదేలే అంటూ దాన్ని కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగా ఇటీవలే ది గ్రే మ్యాన్ తీసిన రస్సో బ్రదర్స్ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది. అక్కడితో ఆగలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన రాజమౌళితో వాళ్ళను మాట్లాడించింది.
అవెంజర్స్ ఎండ్ గేమ్ లాంటి వరల్డ్ వైడ్ లెజెండరీ మూవీని తీసిన దర్శకులిద్దరూ జక్కన్నను పొగడ్తలతో ముంచెత్తుతుంటే అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ ముఖాముఖీలోనే జక్కన్న నెట్ ఫ్లిక్స్ చేసిన తప్పుని నిలదీశాడు. ట్రిపులార్ హిందీ ఒకటి కొంటేనే ఇంత రీచ్ వస్తే ఇక తెలుగు తమిళం తదితర లాంగ్వేజెస్ కూడా సొంతం చేసుకుని ఉంటే గ్లోబల్ రీచ్ ఇంకా పెరిగేదని అన్నాడు. కారణం లేకపోలేదు.డబ్ చేసిన సినిమా కన్నా ఒరిజినల్ నేటివిటీలో చూడాలని కోరుకున్న ఈస్ట్ ఆడియన్స్ చాలా ఉన్నారు.
ఒకవేళ నెట్ ఫ్లిక్స్ లోనే ఆర్ఆర్ఆర్ తెలుగు కూడా ఉంటే మన బాష మీద ఇంగ్లీష్ వ్యూయర్స్ కి సైతం అవగాహనా ఆసక్తి పెరిగేది. అందుకే ఇటీవలే హాట్ స్టార్ లో అందుబాటులో తెచ్చినప్పటికీ నెట్ ఫ్లిక్స్ రేంజ్ వేరే కాబట్టి రీచ్ భారీగా వచ్చేది. 60 దేశాల్లో10 వారాలకు పైగా టాప్ టెన్ ట్రెండింగ్ లో ఉన్న ఒకే ఒక్క నాన్ ఇంగ్లీష్ మూవీగా ట్రిపులార్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ తో చప్పట్లు కొట్టించుకుంటున్న రాజమౌళి ఇక మహేష్ బాబు చేయబోయే విజువల్ వండర్ ఎలా ఉండబోతోందో
This post was last modified on July 31, 2022 12:33 pm
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…