రాబోయే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ పోకిరి, ఒక్కడు స్పెషల్ ప్రీమియర్లను తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేసుకోవడం ఇతర హీరోల అభిమానులకూ స్ఫూర్తినిస్తోంది. రెండేళ్లకో ఒక సినిమా చేస్తున్న తమ హీరోలను ఎక్కువసార్లు బిగ్ స్క్రీన్ మీద చూడాలంటే ఇలా పాత బ్లాక్ బస్టర్స్ ని రీ రిలీజ్ చేయడమొకటే మార్గమని గుర్తించి ఒక్కొక్కరుగా తమ స్వరం పెంచుతున్నారు. ఆల్రెడీ డార్లింగ్ ప్రభాస్ బర్త్ డేకు వర్షంని రీ మాస్టర్ చేసి విడుదల చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు మొదలైపోయాయి.
ఇప్పుడీ లిస్ట్ లో జల్సా వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆ టైంలో పెద్ద హిట్టే కానీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసేంత గొప్పగా ఆడలేదు. కానీ కాలక్రమంలో దీనికి తిరుగులేని కల్ట్ స్టేటస్ వచ్చి పడింది. మాటల మాంత్రికుడి పంచులు, కానిస్టేబుల్ ప్రణవ్ గా బ్రహ్మానందం కామెడీ, ముఖేష్ ఋషి డిఫరెంట్ విలనీ, వీటన్నింటి కంటే పవర్ స్టార్ అదిరిపోయే టైమింగ్ వెరసి మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి. టీవీలో వచ్చిన ప్రతిసారి కామన్ ఆడియన్స్ కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.
అందుకే సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజుకు జల్సాని రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ట్విట్టర్లో దీన్నో ట్రెండ్ గా మార్చేయడంతో కలర్ ఫోటో నిర్మాత, బేబీ దర్శకుడు సాయిరాజేష్ రంగంలోకి దిగి గీతా ఆర్ట్స్ ని సంప్రదించారు. అయితే సదరు టీమ్ థియేటర్ లో ప్రదర్శించడానికి కావాల్సిన ఒరిజినల్ డిపిఎక్స్ ఫైల్ మిస్ అయ్యిందని, వెతికే పనిలో ఉన్నామని, దొరగ్గానే ఇస్తామని అన్నారట. దీంతో జల్సాను వెండితెర మీద చూసేందుకు తెగ ఉత్సాహపడుతున్న అభిమానుల కోరిక నెరేవేరుతుందో లేదో చెప్పలేం. మెల్లగా ఇకపై అందరు హీరోల జన్మదినాలకు ప్రత్యేక సందర్భాలకు ఇలా షోలు వేసుకోవడం ఏడాది పొడవునా ఉంటుందేమో.
This post was last modified on July 31, 2022 9:27 am
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…