Movie News

రవితేజ ఇక వాటికి ఫిక్సయిపోతాడేమో

మాస్ రాజా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లన్నీ చాలా వరకు మాస్ సినిమాలే. హీరోగా కెరీర్ ఆరంభంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, అమ్మ నాన్న తమిళ అమ్మాయి లాంటి చిత్రాల్లో క్లాస్ టచ్ ఉంటుంది. కానీ ఆ తర్వాత మాత్రం మాస్ మసాలా సినిమాలకే ప్రేక్షకులు పట్టం కట్టారు.అందుకే రవితేజ పేరు ముందు మాస్ మహరాజా అనే బిరుదు కూడా వచ్చి చేరింది. అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా రవితేజ నుంచి మాస్ అంశాలే ఆశిస్తారు.

కాస్త ఎంగేజ్ చేసే కథాకథనాలు.. హీరో ఎలివేషన్లు, యాక్షన్ బ్లాక్స్, కామెడీ ఉండి.. రవితేజ ఎనర్జీ తోడైతే సినిమా సూపర్ హిట్ అన్నట్లే. ఐతే ప్రతిసారీ ఒక ఫార్ములాలో సినిమాలు చేసినా కష్టమే. కాబట్టి అప్పుడప్పుడూ రవితేజ.. రూటు మార్చి కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి కథ ప్రధానంగా సాగే, కొంచెం క్లాస్ టచ్ ఉన్న సినిమాలు చేస్తుంటాడు. కానీ అలాంటి ప్రయత్నాలేవీ అతడికి అచ్చి రావట్లేదు.

నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో సారొస్తారు, డిస్కో రాజా లాంటి చిత్రాలు ఇందుకు ఉదాహరణ. ఈ సినిమాలన్నింట్లో విషయం ఉన్నప్పటికీ.. ఏదో లోపం చోటు చేసుకుని అవి మాస్ రాజాకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఓపెనింగ్స్ పరంగానూ గట్టి దెబ్బ పడడంతో ఇలాంటి సినిమాల విషయంలో రవితేజకు కంగారు తప్పట్లేదు. అయినా సరే.. కొంచెం గ్యాప్ తీసుకుని మళ్లీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

ఈ కోవలో వచ్చిన కొత్త సినిమా.. రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమా కోసం రవితేజ పూర్తిగా ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చాడు. తన మార్కు ఎలివేషన్లు, పంచ్ డైలాగులు, విలన్‌తో హోరాహోరీ పోరాటాలు ఇందులో ఏమీ కనిపించవు. పూర్తిగా దర్శకుడి నమ్మి కథకే అగ్ర తాంబూలం దక్కాలని చూశాడు రవితేజ. కానీ ఈ అవకాశాన్ని శరత్ ఉపయోగించుకోలేకపోయాడు.

అనాసక్తికర కథాకథనాలు సినిమాను నీరుగార్చేశాయి. మామూలుగా రవితేజ సినిమాలు ఎలా ఉన్నా.. అతడి ఎనర్జీ, మాస్ ఎలిమెంట్స్ సినిమాను కొంత మేర కాపాడుతుంటాయి. ఓపెనింగ్స్‌కు ఉపయోగపడుతుంటాయి. ‘రామారావు’కు ఆ సానుకూలత కూడా లేదు. ఈ సినిమాకు ఓపెనింగ్స్ పరంగా పెద్ద డెంటే పడేలా కనిపిస్తోంది. ఈ దెబ్బతో మళ్లీ తన ఇమేజ్‌కు భిన్నమైన, క్లాస్ టచ్ ఉన్న, కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలంటేనే రవితేజ భయపడేలా పరిస్థితి తలెత్తుతోంది. ఇక ఆయన తన మార్కు మాస్ మసాలా ఎంటర్టైనర్లకే పరిమితం అయిపోతాడేమో.

This post was last modified on July 30, 2022 5:49 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

4 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

5 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

5 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

6 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

6 hours ago