గతంలో ఫ్యాన్ వార్స్ ఒక పెద్ద ఫ్యామిలీ హీరో అభిమానులకు.. ఇంకో పెద్ద ఫ్యామిలీ హీరో అభిమానులకు మధ్య ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల అబిమానుల మధ్య కూడా ఒక రేంజిలో గొడవలు జరుగుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ అభిమానులకు.. మిగతా మెగా ఫ్యాన్స్‌కు మధ్య ఎలా కుంపట్లు రాజుకుంటున్నాయో తెలిసిందే.
నందమూరి ఫ్యామిలీలో సైతం ఇలాంటి విభేదాలు లేకపోలేదు. నందమూరి అభిమానుల్లో ఎక్స్‌క్లూజిక్ బాలయ్య అభిమానులు.. ఎక్స్‌క్లూజివ్ ఎన్టీఆర్ అభిమానులు.. ఓవరాల్ నందమూరి అభిమానులు.. ఇలా మూడు వర్గాలు తయారయ్యాయి. ఇందుకు రాజకీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయన్నది స్పష్టం.
తారక్ రాజకీయంగా ఎక్కడ ఎదిగిపోతాడో, నారా లోకేష్‌కు ప్రాధాన్యం లేకుండా పోతుందో అని అతణ్ని ముందు నుంచే తొక్కేందుకు బాలయ్య, చంద్రబాబు కలిసి కుట్ర చేస్తున్నారని.. అతణ్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తారక్ ఫ్యాన్స్ ఆరోపిస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోగా ఎదిగే వరకు బాలయ్య పేరు చెప్పుకున్న తారక్.. ఒక స్థాయి అందుకున్నాక ఆయన్ని లెక్క చేయట్లేదని బాలయ్య ఫ్యాన్స్ అంటుంటారు.
ఈ నేపథ్యంలో తన అన్నయ్య కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో తారక్ మాట్లాడిన మాటలు.. అక్కడ జరిగిన కొన్నిపరిణామాలు చర్చనీయాంశం అయ్యాయి. ఈవెంట్ మధ్యలో ఒక అభిమానికి మైక్ ఇచ్చిన యాంకర్ తారక్ గురించి మాట్లాడమంటే అతను.. బాలయ్య గురించే మాట్లాడతానంటూ జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేయడంతో ఈ వీడియో మీద సోషల్ మీడియాలో చర్చ నడిచింది.
తారక్ ముఖ్య అతిథిగా హాజరైన ఈవెంట్లో ఇదేం పని అంటూ బాలయ్య అభిమానులపై తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఈ సభలో ఎన్టీఆర్ పేరు చెప్పి సీఎం సీఎం అని నినాదాలు చేయడాన్ని అవతలి వర్గం తప్పుబడుతోంది. మరోవైపు తారక్ తన ప్రసంగంలో తాత, తండ్రి పేర్లు ప్రస్తావించి బాలయ్య పేరును విస్మరించడాన్ని బాలయ్య అభిమానులు ఎత్తి చూపుతున్నారు. కానీ ఇందులో తప్పుబట్టడానికి ఏముందన్నది తారక్ ఫ్యాన్స్ వాదన. తన తాత, తండ్రి అభిమానులను తమకు విడిచిపెట్టి వెళ్లిపోయారని తారక్ పేర్కొన్నాడని.. చనిపోయిన వారి గురించి మాట్లాడుతూ తారక్ ఆ కామెంట్ చేశాడని.. ఇక్కడ బాలయ్య ప్రస్తావన ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. అంతే కాక బాలయ్య సందర్భం వచ్చిన ప్రతిసారీ తారక్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నపుడు, అతడి పేరును విస్మరించడం చేస్తున్నపుడు తారక్‌కు మాత్రం ఆత్మాభిమానం ఉండదా.. అతనెందుకు ప్రతిసారీ బాలయ్య గురించి మాట్లాడాలి అని కూడా వారు నిలదీస్తున్నారు.
This post was last modified on July 30, 2022 2:27 pm
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్‌షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్‌పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…