పెద్ద హీరోల సినిమాల పుట్టిన రోజులు వచ్చినపుడు.. అభిమానుల ఆనందం కోసం తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద సిటీల్లో స్పెషల్ షోలు వేయడం మామూలే. తమిళనాడులో కూడా ఈ సంప్రదాయం ఉంది. ఈ షోలు చాలా పరిమిత సంఖ్యలోనే ఉంటాయి.
ప్రతి సంవత్సరం, ప్రతి షో ఫుల్ అయిపోతుందని, థియేటర్లు కళకళలాడుతాయని గ్యారెంటీ ఏమీ లేదు. కానీ ఈసారి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని ఆగస్టు 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున షోలు ప్లాన్ చేయడం.. వాటికి సంబంధించి రెండు నెలల ముందు నుంచే హంగామా మొదలు కావడం.. టికెట్లు అమ్మకానికి పెడితే హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక కొత్త సినిమా చూడబోతున్న స్థాయిలో పోకిరి, ఒక్కడు, దూకుడు, బిజినెస్‌మేన్ సినిమాల స్పెషల్ షోలకు డిమాండ్ కనిపిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పోకిరి, ఒక్కడు సినిమాలకు పదుల సంఖ్యలో షోలు పడబోతున్నాయి. పాత ప్రింట్లను రీమాస్టర్ చేసి 4కే రెజొల్యూషన్‌తో రిలీజ్ చేస్తుండడంతో మహేష్ అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఐతే ఈ సందడి తెలుగు రాష్ట్రాలకే పరిమితం కావడం లేదు. యుఎస్‌లో సైతం ఈ స్పెషల్ షోలు ప్లాన్ చేస్తుండడం విశేషం.
కాలిఫోర్నియాలోని ఒక థియేటర్లో పోకిరి స్పెషల్ షో కోసం బుకింగ్స్ ఓపెన్ చేస్తే కేవలం గంటలో మొత్తం థియేటర్ సోల్డ్ ఔట్ అయిపోయిందట. అక్కడ పోకిరి రీమాస్టర్ ప్రింటే ప్రదర్శించబోతున్నారు. 18 ఏళ్ల ముందు రిలీజైన సినిమాను ఇప్పుడు యుఎస్‌లో ప్రదర్శిస్తుంటే.. ఒక కొత్త సినిమా స్థాయిలో దాని టికెట్లకు డిమాండ్ ఏర్పడడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈసారి మహేష్ పుట్టిన రోజును ఫ్యాన్స్ చాలా స్పెషల్‌గా భావిస్తున్నారని.. సందడి మామూలుగా ఉండబోదని చెప్పడానికి ఇది సంకేతం. తెలుగు రాష్ట్రాల్లో హంగామా మరో స్థాయిలో ఉండబోతోందన్నది స్పష్టం.
This post was last modified on July 30, 2022 1:41 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…