తమ హీరోలను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎంతగా తపించిపోతారో మాటల్లో చెప్పడం కష్టం. యుట్యూబ్, టీవీ ఛానల్స్ లో ఎక్కడికీ కదలకుండా లైవ్ చూసే అవకాశం ఉన్నా కళ్లెదురా చూడాలనే ఆత్రంతో రిస్క్ చేసి మరీ విపరీతమైన రద్దీలో ప్రీ రిలీజ్ ఈవెంట్లకు, సక్సెస్ మీట్లకు వస్తుంటారు. నిన్న జరిగిన బింబిసారకు సైతం జూనియర్ ఎన్టీఆర్ ని, కళ్యాణ్ రామ్ ని చూడాలనే యాంగ్జైటీతో వేలాది అభిమానులు హైదరాబాద్ శిల్పకళావేదికకు తరలివచ్చారు. అయితే అనుకోని విషాదం చోటు చేసుకుంది.
సాయిరామ్ అనే వీరాభిమాని నిన్న జరిగిన వేడుకకు హాజరయ్యాడు. కారణాలు బయటికి చెప్పలేదు కానీ అతను కన్నుమూసిన వార్త రాత్రే వెలుగులోకి వచ్చినప్పటికీ ఇందాక ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించాక స్పష్టత వచ్చింది. ఇతనిది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెంటపాడు మండలం. భాగ్యనగరంలోనే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈవెంట్ జరగడానికి ముందే ఫిట్స్ వచ్చాయని ఆసుపత్రికి చేర్చినా ఫలితం దక్కలేదని అంటున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
జాగ్రత్తగా ఇంటికి వెళ్లండని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన కొంత సమయానికి ఇలా జరగడం బాధాకరం. అన్నయ్య, తండ్రిని ప్రమాదంలో కోల్పోయినప్పటి నుంచి తారక్ తన ప్రతి సినిమాలో ప్రేక్షకులకు జాగ్రత్తలు చెబుతూనే ఉంటాడు. దీనికో స్పెషల్ కార్డు కూడా వేస్తారు. నిన్న సైతం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారని వాళ్లే ముఖ్యమని నొక్కి చెప్పిన వేదిక వద్దే ఒక అభిమాని కన్నుమూయడం ఫ్యాన్స్ ని కన్నీళ్లు పెట్టిస్తోంది. సాయిరామ్ కుటుంబానికి కావాల్సిన సహాయాన్ని అందజేస్తామని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటనలో పేర్కొంది. ఎక్కడికి వెళ్లినా జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరమో సినిమా కన్నా జీవితం ముఖ్యమని మరోసారి ఈ సంఘటన చాటి చెప్పింది.
This post was last modified on July 30, 2022 1:21 pm
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…