ఈ మధ్య కాలంలో మేకింగ్ టైంలో ఏ హడావుడీ చేయకుండా.. వేరే ప్రమోషన్లు ఏమీ చేయకుండా.. కేవలం రెండు ట్రైలర్లు రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం అంటే బింబిసారనే. ఎంత మంచి వాడవురా లాంటి డిజాస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమాను మొదట అనౌన్స్ చేసినపుడు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.
కానీ ట్రైలర్ చూశాక అంతా ఆశ్చర్యపోయారు. కొత్త దర్శకుడు అయినప్పటికీ వశిష్ఠ్ చాలా బాగా డీల్ చేసినట్లే కనిపించాడు ట్రైలర్ చూస్తే. ఈ సినిమాకున్న బజ్‌ను కొన్ని రోజుల ముందు వచ్చిన రిలీజ్ ట్రైలర్ మరింత పెంచింది.
ఐతే ఆ ట్రైలర్ రిలీజ్ చేసిన టైమింగ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో భాగంగా రిలీజ్ ట్రైలర్‌ను ప్రి రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేస్తే బాగుండేది కదా అని కళ్యాణ్ రామ్ వద్ద ప్రస్తావిస్తే అతను వివరణ ఇచ్చాడు.
ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణ అని.. అతను ఏం మాట్లాడతాడన్న దాని మీదే అందరి దృష్టీ ఉంటుందని.. అతను ఇప్పటికే సినిమా చూశాడు కాబట్టి దాని గురించి తను మాట్లాడితే చాలని వ్యాఖ్యానించాడు. సినిమా గురించి తారక్ ఇచ్చే ఎలివేషన్ కావాల్సినంత ప్రమోషన్ తెచ్చి పెడుతుందన్నది కళ్యాణ్ రామ్ ఉద్దేశం కావచ్చు.
కాగా అన్న నమ్మకాన్ని నిలబెడుతూ.. అతనేం కోరుకున్నాడో అది ప్రి రిలీజ్ ఈవెంట్లో ఇచ్చేశాడు తారక్. బింబిసార గురించి అతను ఒక రేంజిలో మాట్లాడాడు. బింబిసార కథను తాను చాన్నాళ్ల ముందే విన్నానని.. వశిష్ఠ్ నరేషన్ విని కొత్త దర్శకుడు ఇంత పెద్ద కథను ఎలా డీల్ చేయగలడా అని సందేహించానని.. కానీ అతను కథ చెప్పినదాని కంటే గొప్పగా తెరకెక్కించి తన సందేహాలను పటాపంచలు చేశాడని తారక్ అన్నాడు.
కథ, కథనం తెలిసిన తానే సినిమా చూసి థ్రిల్లయ్యానని.. రేప్పొద్దున థియేటర్లలో ప్రేక్షకులు మరింత థ్రిల్ అవుతారని తారక్ అన్నాడు. వశిష్ఠ్ ప్రతిభకు బింబిసార టీజర్ మాత్రమే అని.. కళ్యాణ్ రామ్ తప్ప ఇంకెవరూ చేయలేరు అన్న తరహాలో ఇందులో రెండు పాత్రలను పోషించాడని.. కీరవాణి సంగీతం సినిమాకు వెన్నెముక అని తారక్ అన్నాడు. మొత్తానికి సినిమా మీద హైప్‌ను మరింత పెంచేలా తారక్ స్పీచ్ అదరగొట్టేశాడనే చెప్పాలి.
This post was last modified on July 30, 2022 11:10 am
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…