టాలీవుడ్ లో చాలా మంది నటులు అరువు గొంతుతో కాలం వెల్లగొడుతుంటారు. అందులో హీరో వేణు ఒకరు. ‘స్వయంవరం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు తొట్టెంపూడికి మొదటి సినిమాకు వాయుపుత్ర నాగార్జున అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గొంతు ఇచ్చాడు. ఆ సినిమాలో వేణుకి ఆ వాయిస్ యాప్ట్ అయింది. దాంతో ఆ వెంటనే అన్ని సినిమాలకు నాగార్జుననే వేణుకి డబ్బింగ్ చెప్పాడు. ముఖ్యంగా ‘చిరు నవ్వుతో’ సినిమాలో నాగార్జున వాయిస్ కాకుండా వేణు వాయిస్ ఉంటే డైలాగ్స్ ఆ రేంజ్ లో క్లిక్ అయ్యేవి కావు. ఇది వేణు కూడా ఒప్పుకోవాల్సిందే. ఇలా కొన్నేళ్లుగా తనకి పర్ఫెక్ట్ వాయిస్ అనిపించుకున్న నాగార్జున గొంతు కాకుండా ఈసారి వేణు తన సొంత డబ్బింగ్ ట్రై చేశాడు.
రామారావు ఆన్ డ్యూటీ తో వేణు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మురళి అనే పోలీస్ కేరెక్టర్ చేశాడు వేణు. సినిమాలో మంచి రోలె చేశాడు. ఆల్మోస్ట్ సినిమా అంతా ఉంటాడు. పైగా ఎక్కువ డైలాగులు ఉన్నాయి. అదీ చిత్తూరు స్లాంగ్ లో. ఇక్కడే వేణు పప్పులో కాలేశాడు. కొన్నేళ్లుగా వేణు కి వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ ఇస్తాడని ఎవరికీ తెలియదు. కానీ రామారావు లో వేణు డైలాగులు విని అందరికీ అర్థమైపోయింది. పాత్ర అంతో ఇంతో బాగున్నప్పటికీ వేణు సొంత డబ్బింగ్ మాత్రం తేడా కొట్టేసింది.
అప్పట్లో డా.రాజశేఖర్ కూడా సాయి కుమార్ ని కొన్ని సినిమాలకు పక్కన పెట్టేసి వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించుకున్నాడు. కానీ వాయిస్ యాప్ట్ కానందున మళ్ళీ సాయి కుమార్ ని లైన్లో పెట్టేసి ప్రస్తుతం ఆయనతోనే డబ్బింగ్ చెప్పించుకుంటున్నాడు. మరి వేణు కూడా తన సొంత డబ్బింగ్ గురించి ఫీడ్ బ్యాక్ తెసుకొని మళ్ళీ వాయుపుత్ర నాగార్జునని తెచ్చుకుంటే బెటర్. లేదంటే ఇన్నేళ్ళు వేణు సినిమాలు చూసిన ప్రేక్షకులు సొంత గొంతుతో వేరే యాక్టర్ ని చూసినట్టు చూస్తారు.
This post was last modified on July 30, 2022 10:50 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…