ఇంకో పది రోజుల్లో రాబోతున్న మహేష్ బాబు పుట్టినరోజుకి అభిమానుల ప్రిపరేషన్లు మాములుగా లేవు. ఇప్పటికే పోకిరి ప్రింట్ ని ఫోర్ కె రిజొల్యూషన్ కి రీ మాస్టర్ చేసి థియేటర్ రిలీజ్ కి సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక్కడు కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఆగస్ట్ 9న తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై లాంటి ఇతర నగరాల్లో కూడా షోలు ప్లాన్ చేస్తున్నారు. మనకంటే ముందే తమిళనాట బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్ పెట్టడం గమనార్హం. పోకిరి ఇక్కడే కాదు ఏకంగా కాలిఫోర్నియాలోనూ స్పెషల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది.
ఇంత భారీ స్థాయిలో డబుల్ రీ రిలీజ్ కొత్త జనరేషన్ లో ఎవరికీ దక్కలేదన్నది వాస్తవం. సోషల్ మీడియాలో అప్పుడే వీటి తాలూకు సందడి మొదలైపోయింది. కాకినాడలో రెండూ వేయబోతున్నామని ఫ్యాన్స్ ప్రకటించేశారు. హైదరాబాద్ తో సహా కీలక పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో ఇవి ఉంటాయి. కాకపోతే టైమింగ్స్ క్లాష్ అయితే మాత్రం ఏది చూడాలో అర్థం కాని అయోమయం ఏర్పడుతుంది. పోకిరి, ఒక్కడు రెండూ ఓటిటి, యుట్యూబ్ లో ఉచితంగా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ క్రేజ్ రావడం చూస్తే అది ప్రిన్స్ కే సాధ్యమేమో.
ఒక్కడు నిర్మాత ఎంఎస్ రాజు కొత్త ప్రింట్ ని క్యూబ్ లో అప్లోడ్ చేయించామని, ఇక ఫ్యాన్స్ షోస్ వేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకప్పుడు మహేష్ కి మాస్ ఇమేజ్ రావడంలో ఒక్కడు పోషించిన పాత్ర చిన్నది కాదు. మణిశర్మ పాటలు, కొండారెడ్డి బురుజు దగ్గర ప్రకాష్ రాజ్ ని కొట్టే సీన్, చార్మినార్ ఎపిసోడ్ ఒకటా రెండా దర్శకుడు గుణశేఖర్ చేసిన మాయాజాలం అంతా ఇంతా కాదు. ఇప్పుడీ ట్రెండ్ చూసి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోల బర్త్ డేలకూ ఇలాంటివి ప్లాన్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
This post was last modified on July 29, 2022 4:35 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…