టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తీసిన సక్సెస్ ఫుల్ మూవీస్ ఎన్నో. ఇప్పుడంటే ఆయన తీసిన సినిమాలు ఆడటం లేదు కానీ ఒకప్పుడు జడ్జిమెంట్ ఉన్న నిర్మాతగా వరుస సక్సెస్ లు అందుకున్నారు రాజు. ఆయన తీసిన బెస్ట్ ఫ్యామిలీ మూవీస్ లో ‘సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు’ ఒకటి. ఆ సినిమాతో చిన్నోడు పెద్దోడు అంటూ మహేష్ , వెంకటేష్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. ఆ సినిమా వెనుక చాలా సంగతి ఉంది. ఆ సినిమా బిహైండ్ స్టోరీ ఇటివలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు దిల్ రాజు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కథ ముందుగా వెంకటేష్ కి చెప్పి ఆ తర్వాత మహేష్ ని లాక్ చేసుకున్నారట. అలాగే షూటింగ్ డిలే అవుతూ వచ్చిన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయమని మహేష్ సజిస్ట్ చేశాడని దిల్ రాజు చెప్పుకున్నాడు. ఇక రిలీజ్ కి మూడు రోజుల ముందే షో వేసుకొని ఒక్కడే చూశాడట దిల్ రాజు.
ఆ కాన్ఫిడెంట్ తో సినిమా హిట్ అవ్వనుందని గట్టిగా నమ్మారట. అయితే ముందు రోజు చారిటీ కోసం స్పెషల్ షో వేస్తే అందులో కూర్చొని సినిమా చూసిన ప్రముఖ నిర్మాత నల్లమలపు బుజ్జి నేరుగా దిల్ రాజు ఆఫీస్ కి వచ్చేసాడట. సరిగ్గా అదే టైంలో దిల్ రాజు ఆఫీసులో ఇంకం ట్యాక్స్ రైడ్ జరుగుతుంటే వారితో సిరీయస్ గా మాట్లాడి అనంతరం సినిమా బాలేదని దిల్ రాజుకి మొఖం మీదే చెప్పేశాడట బుజ్జి.
‘బొమ్మరిల్లు’ చూసి బెస్ట్ ఫీడ్ బ్యాక్ ఇచ్చిన నిర్మాత బుజ్జి ఈసారి సీతమ్మ వాకిట్లో గురించి అలా చెప్తుంటే దిల్ రాజు షాకయ్యాడట. ఆ సమయంలో బుజ్జితో దిల్ రాజు “చూస్తూ ఉండు సినిమా కచ్చితంగా ఆడుద్ది” అని ధీమాగా చెప్పాడట.
కానీ బుజ్జి మాత్రం ఈసారి దిల్ రాజు లెక్క తప్పనుందని సినిమా ఆడదని అనుకున్నాడట. తీరా చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ రిపోర్ట్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించి నిర్మాతగా దిల్ రాజు కి మంచి లాభాలతో పాటు ప్రశంసలు తెచ్చిపెట్టింది.
ఏదేమైనా అప్పట్లో దిల్ రాజు జడ్జిమెంటే వేరు. ఆయన పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉండేది. సక్సెస్ కోసం ఆయన ఎన్నో రాత్రులు వర్క్ చేసే వారు. అందుకే అప్పట్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఒక సినిమా అయినా చేయాలని కోరుకునే వారు స్టార్ హీరోలు. కానీ ఇప్పుడు దిల్ రాజు లెక్క తప్పుతుంది. వరుసగా అపజయాలు అందుకుంటూ జడ్జిమెంట్ పోయిందనే కామెంట్స్ అందుకుంటున్నారు. రాబోయే సినిమాలతో అయినా దిల్ రాజు ఐయాం బ్యాక్ అనిపించుకొని బిగ్గెస్ట్ హిట్ కొడితే బాగుండని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
This post was last modified on July 28, 2022 10:34 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…