స్టార్ డైరెక్టర్ అయినంత మాత్రాన తన కొడుకు స్టార్ హీరో అయిపోవాలని లేదు. కొడుకుని నటుడిగా పరిచయం చేయడం వరకే స్టార్ డైరెక్టర్ అనే కార్డు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎవరైనా కష్టపడి ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ అందుకోవాల్సిందే. లేదంటే వచ్చినంత స్పీడుగా ఇంటికి పంపేసి రిజెక్ట్ చేసేస్తారు ఆడియన్స్. దర్శక దిగ్గజం దాసరి లాంటి వారే కొడుకుని హీరోగా నిలబెట్టలేకపోయారు. ఇక ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఇవీవీ సత్యనారాయణ కొడుకు రెండో కొడుకు ఆర్యన్ రాజేష్ పరిస్థితి ఇదే. ఇవీవీ తనయుడిగా అల్లరి నరేష్ ఒక్కడే సక్సెస్ అయ్యాడు.
అప్పుడెప్పుడో ‘హాయ్’ సినిమాతో హీరోగా లాంచయిన ఆర్యన్ రాజేష్ వరుసగా సినిమాలు చేసినా ఫలితం దక్కలేదు. అతడు చేసిన అన్నిటిలో ఇప్పటికీ గుర్తుండే సినిమాలు రెండే రెండు. ఒకటి సొంతం , రెండు ఎవడి గోల వాడిదే. ఈ రెండు మినహా చేసినవన్నీ బెడిసి కొట్టాయి. అయితే మొన్నీ మధ్యే ఆర్యన్ రాజేష్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో అన్నయ్య గా నటించాడు. ఆ సినిమాతో కనీసం కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలవుదామనుకున్నాడు. కానీ అదీ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు చేసేదేం లేక వెబ్ సిరీస్ లకు షిఫ్ట్ అయిపోయాడు.
జీ 5 కోసం నిహారికా కొణిదెల ‘హలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్ చేసింది. అందులో ఓ కీ రోల్ చేశాడు ఆర్యన్ రాజేష్. అప్పుడెప్పుడో ఫేడవుట్ అయిపోయిన సదా కూడా ఇందులో నటించింది. అయితే ఇది కంప్లీట్ ఆఫీస్ డ్రామాగా తెరకెక్కిన సిరీస్. మరి ఇందులో ఆర్యన్ రాజేష్ ది క్లిక్ అయ్యే కేరెక్టరేనా ? దీని తరువాత వెబ్ సిరీస్ లతో అయినా నటుడిగా బిజీ అవుతాడా ? చూడాలి.
This post was last modified on July 28, 2022 10:29 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…