Movie News

బోయపాటి పై వేణు కామెంట్స్ !

కొన్నేళ్ళ క్రితం హీరోగా మంచి ఫాంలో ఉన్నాడు వేణు తొట్టెంపూడి. అప్పుడప్పుడే త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా అడుగులు వేస్తున్నాడు. తన సినిమాలతో రైటర్ గా ఎంకరేజ్ చేసి త్రివిక్రమ్ కి వరుస అవకాశాలు ఇచ్చాడు వేణు. అయితే అంత చేసిన వేణుకి త్రివిక్రమ్ కృతజ్ఞత చెప్పకుండా ఉన్నాడా ? అసలు వేణుకి ఇంతవరకూ త్రివిక్రమ్ ఒక్క రోల్ కూడా ఎందుకు ఇవ్వలేదు ? ఈ ప్రశ్నలకు తాజాగా సమాధానం చెప్పాడు వేణు. ఈ క్వశ్చన్ కి వేణు ఆన్సర్ విని అందరూ షాకయ్యారు.

మహేష్ తో త్రివిక్రమ్ తీసిన ‘అతడు’ సినిమాలో సూను సూద్ కేరెక్టర్ గుర్తుంది కదా .. ఆ కేరెక్టర్ కి త్రివిక్రమ్ ముందుగా అనుకున్నది వేణునే అంట. ఈ విషయాన్ని ఇటివలే ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకున్నాడు వేణు. అయితే ఆ కేరెక్టర్ చేయలేకపోయానని అన్నాడు. అంటే త్రివిక్రమ్ వేణుని గుర్తుపెట్టుకొని ఆ కేరెక్టర్ ఇవ్వడం గొప్ప విషయమే. సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ అది. బహుశా ఫ్రెండ్ గా ఉంటూ చివర్లో నెగటివ్ షేడ్స్ చూపించే రోల్ ఎందుకులే అని వేణు అనుకోని ఉండొచ్చు. అందుకే లైట్ తీసుకొని రిజెక్ట్ చేసి ఉండొచ్చు.

ఇక బోయపాటి శ్రీను ఆ మధ్య తీసిన ‘దమ్ము’లో వేణు ఓ రోల్ చేసిన సంగతి తెల్సిందే. ఆ సినిమా గురించి కూడా ఓ విషయం బయటపెట్టాడు వేణు. ‘దమ్ము’లో మీ పాత్ర చాలా చిన్నది కదా అదెలా చేశారు ? అని అడగ్గానే బోయపాటి నాకు షోలే సినిమాలో అమితాబ్ రోల్ లాంటిదని చెప్పాడు. బహుశా అందులో కూడా అమితాబ్ చచ్చిపోతాడని అలా చెప్పి ఉండొచ్చు అంటూ కామెంట్ పాస్ చేసి పంచ్ పేల్చాడు. దీంతో బోయపాటి నెరేషన్ ఎలా ఉంటుందో యాక్టర్స్ ని ఒప్పించడానికి ఎలాంటి విషయాలు చెప్తాడో తెలిసిపోయింది.

This post was last modified on July 28, 2022 10:18 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

5 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago