దిల్ రాజు చాలా మంది దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఇప్పుడున్న టాప్ దర్శకుల్లో ఎక్కువ మంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఓనమాలు దిద్దుకున్నవాళ్ళే. ముఖ్యంగా సుకుమార్ ని ‘ఆర్య’తో బోయపాటి శ్రీను ని ‘భద్ర’ డైరెక్టర్స్ గా లాంచ్ చేసి ఇండస్ట్రీకి మంచి దర్శకులను ఇచ్చారు. అయితే దిల్ రాజు లాంచ్ చేసిన దర్శకులంతా అదే బేనర్ లో రెండో సినిమా చేశారు కానీ ఆ లిస్టులో సుక్కు , బోయపాటి మాత్రం లేరు. వీరిద్దరితో రెండో సినిమా చేయలేదు దిల్ రాజు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ , బోయపాటి లతో ఎందుకు రెండో సినిమా చేయలేదు అనే ప్రశ్న దిల్ రాజు కి ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ సుకుమార్ , బోయపాటి అలాగే వినాయక్ లతో రెండో సినిమా చేయలేకపోయాను. ఆ టైంలో నేను కొత్త దర్శకులతో సినిమాలు ప్లాన్ చేసుకోవడం అలాగే వాళ్ళు కూడా డైరెక్టర్స్ గా బిజీగా ఉండటం వల్ల ఎందుకో కుదరలేదు. అయితే సుకుమార్ తో ఐదేళ్ళుగా ఓ సినిమా అనుకుంటున్నా కానీ సెట్ అవ్వలేదు. త్వరలోనే సుకుమార్ , బోయపాటి శ్రీను లతో సినిమాలు చేయబోతున్నా అంటూ చెప్పుకున్నారు.
దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెండో సినిమా ‘సెల్ఫిష్’ కి సుకుమార్ ఒక నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో కూడా సినిమా ఉండనుంది. దీనికి సంబంధించి ఎనౌన్స్ మెంట్ త్వరలోనే ఉంటుందని రాజు తెలిపారు. మరి ఆర్య తర్వాత ఇన్నేళ్ళకి కలుస్తున్న ఈ ఇద్దరూ ఎలాంటి కథతో సినిమా చేస్తారో వెయిట్ అండ్ సీ.
This post was last modified on July 28, 2022 11:43 am
పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…
అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. అధిక శాతం…
దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం…
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…