ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అర్థం కాక బన్నీ ఫ్యాన్స్ ఎదురు చూసి చూసి అలిసిపోతున్నారు. 2022లో ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయాయి. దర్శకుడు సుకుమార్ ఇంకా స్క్రిప్ట్ ని చెక్కుతూనే ఉన్నారు. తన శిష్యుడు, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుని సైతం రంగంలోకి దింపి కథా చర్చల్లో యమా బిజీగా ఉన్నారు. ఆయనొక్కరే కాదు రంగస్థలం టైంలో సుక్కుతో పని చేసిన రైటర్లందరూ ఇప్పుడు కేవలం పుష్ప 2 కోసమే పని చేస్తున్నారు. అయినా ఒక కొలిక్కి రావడం లేదు.
నిజానికి ఫస్ట్ పార్ట్ షూటింగ్ టైంలోనే సుకుమార్ సీక్వెల్ కి సంబంధించిన స్టోరీని ఒక కొలిక్కి తెచ్చారట. అయితే పుష్ప 1కి నార్త్ ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందన చూశాక బన్నీ ఎంత ఆలస్యమైనా పర్లేదు బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేలా చేయమని సూచించడంతో ఇదిగో ఇలా ఆలస్యం చేయాల్సి వచ్చింది. బడ్జెట్ విషయంలో మైత్రి ఈసారి తగ్గేదేలే అంటోంది కానీ స్క్రిప్ట్ గురించి కూడా హీరో దర్శకుడు అదే మాట అంటుండటంతో అంతకంతా ఆలస్యం తప్పలేదు. పోనీ ఆగస్ట్ నుంచైనా గన్ షాట్ గా సెట్స్ పైకి వెళ్తుందా అంటే ఛాన్స్ తక్కువే.
ఈ లెక్కన పుష్ప వచ్చే వేసవికి సిద్ధం కావడం అనుమానమే. ఎందుకంటే మరో సవాల్ కళ్ళముందు ఉంది. ఆర్టిస్టుల కాల్ షీట్లు సెట్ చేసుకోవాలి. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ ఎప్పుడుబడితే అప్పుడు డేట్లిచ్చే పరిస్థితిలో లేరు. ఒక్కొక్కరి చేతిలో అయిదారు సినిమాలున్నాయి. సుకుమార్ ఫస్ట్ పార్ట్ లాగా మరీ లేట్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. అందుకే అన్ని వైపులా అన్నీ లాక్ చేసుకున్నాకే రంగంలోకి దిగాలని సుకుమార్ డిసైడ్ అయ్యారట. స్టార్ట్ చేసి లేట్ చేయడం కన్నా అదేదో ముందే చూసుకుని డిలే తగ్గించాలనేది ప్లాన్ గా కనిపిస్తోంది. ఈ మధ్య కొత్త ఆర్టిస్టుల కోసం ఆడిషన్లు చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 28, 2022 2:44 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…