అదేంటో కొందరు హీరోయిన్లకు ఒక్క డిజాస్టర్ రాగానే కెరీర్ అమాంతం కిందకు పడిపోతుంది. మరికొందరికి ఎన్ని ఫ్లాపులు వచ్చినా అవకాశాలు లోటు లేకుండా పోతుంది.ఎప్పుడో 2010లో ఝుమ్మంది నాదంతో తెరంగేట్రం చేసిన తాప్సీ పన్ను ఇప్పుడు రెండో క్యాటగిరీ కింద బాలీవుడ్ లో బ్రహ్మాండమైన కెరీర్ ని ఎంజాయ్ చేస్తోంది.
ఇటీవలే వచ్చిన శబాష్ మితు బాక్సాఫీస్ వద్ద ఎంత దారుణంగా దెబ్బ తిందో చూశాం. తక్కువలో తక్కువ ముప్పై కోట్ల బడ్జెట్ పెడితే పట్టుమని నాలుగు కోట్లు తేలేక ఘోరమైన ఫలితాన్ని అందుకుంది.
దీనికన్నా ముందు తెలుగులో చేసిన మిషన్ ఇంపాజిబుల్ చేదు అనుభవాన్నే ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ లూప్ లపేటాకు వచ్చిన రెస్పాన్స్ సోసోనే. రష్మీ రాకెట్ ది కూడా అదే దారి. అన్నాబెల్లె సేతుపతి అయ్య బాబోయ్ అనిపిస్తే హసీన్ దిల్ రుబా పర్లేదనిపించుకుంది.
ఇవన్నీ ఓటిటిలో వచ్చాయి కాబట్టి సరిపోయింది కానీ లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఒక్క తప్పడ్ మాత్రమే పెర్ఫార్మన్స్ పరంగా రిటర్న్స్ పరంగా సేఫ్ ప్రాజెక్ట్ అనిపించుకుంది. ఇంత జరిగినా తాప్సీకి ఎలాంటి ఢోకా లేదు.
ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలు తన చేతిలో ఉన్నాయి. అందులో షారుఖ్ ఖాన్-రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వస్తున్న డుంకీ ఉంది. అనురాగ్ కశ్యప్ తీస్తున్న దొబరా ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. బ్లర్, ఓ లడికీ కహా హై నిర్మాణంలో ఉన్నాయి.
తమిళంలో ఏలియన్, జనగణమాణ చేస్తోంది. ఇవి కాకుండా సమంతా ప్రధాన పాత్రలో తాప్సీనే నిర్మాతగా మారిన సినిమా మరొకటుంది. ఈ లెక్కన అమితాబ్ బచ్చన్ తో చేసిన పింక్, బద్లాలు తాప్సీకి ఎంత పెద్ద మేలు చేశాయో ఈ లిస్టు చూస్తే అర్థమవుతుందిగా
This post was last modified on July 28, 2022 10:34 am
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…