‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా ఎంతకీ మొదలు కాకపోవడం పట్ల అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా శంకర్ సినిమాను లైన్లో పెట్టి చకచకా లాగించేస్తుంటే.. తారక్ మాత్రం పది నెలలకు పైగా ఖాళీగా ఉండడం, ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత కూడా సినిమా మొదలుపెట్టకపోవడం ఫ్యాన్స్‌కు రుచించడం లేదు.
‘ఆచార్య’కు సంబంధించిన సెటిల్మెంట్ గొడవల్లో కొరటాల చిక్కుకోవడం తాజా ఆలస్యానికి కారణంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్ కొత్త చిత్రం కొరటాలతోనే ఉంటుందా లేదా అనే విషయంలోనూ సందేహాలు తలెత్తుతున్నాయి. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానాతో తారక్ కొత్త సినిమా మొదలుపెట్టాలనుకుంటున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయోమయంలో ఉన్న నందమూరి అభిమానులకు తన కొత్త చిత్రం విషయంలో జరుగుతున్న ఆలస్యంపై అతడి సోదరుడు కళ్యాణ్ రామ్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు ఓ ఇంటర్వ్యూలో.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఊహించని స్థాయికి వెళ్లిపోయిందని.. ప్రపంచ స్థాయికి చేరుకుందని.. అలాంటి సినిమా తర్వాత ఎలాంటి చిత్రం చేయాలనే విషయంలో తారక్ చాలా ఆలోచిస్తున్నాడని కళ్యాణ్ రామ్ తెలిపాడు. నిర్మాతలుగా తమ మీదా చాలా బాధ్యత ఉంటుందని.. ఆ బాధ్యత నుంచే భయం, జాగ్రత్త పుడతాయని కళ్యాణ్ రామ్ తెలిపాడు. అభిమానుల ఆతృతను అర్థం చేసుకోగలమని, వాళ్లు అప్‌డేట్స్ కోరుకుంటారని, కానీ ఏ అప్‌డేట్ ఇచ్చినా అథెంటిగ్గా ఉండాలని, అందరికీ నచ్చేలా ఉండాలని తాము భావిస్తామని కళ్యాణ్ రామ్ తెలిపాడు.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీగా పెరిగిన అంచనాలను అందుకోవడం కోసం ప్రతి విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించి కానీ ఏదీ చేయలేమని.. కాబట్టే ఆలస్యం జరుగుతోందని.. తారక్‌తో కొత్త సినిమా చేయబోయే దర్శకుడి మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుందని.. అన్నీ జాగ్రత్తగానే జరుగుతున్నాయని.. కాబట్టి అభిమానులు కొంచెం ఓపకి పట్టాలని కళ్యాణ్ రామ్ విజ్ఞప్తి చేశాడు. తన సినిమా ‘బింబిసార’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు తారక్ ముఖ్య అతిథిగా వస్తున్నాడని.. అతణ్ని చూడడానికి, అలాగే తన ప్రసంగం వినడానికి అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని.. ఆ రోజు ఫోకస్ మొత్తం తనమీదే ఉండాలనే ఉద్దేశంతో సినిమాకు సంబంధించి రిలీజ్ ట్రైలర్ కూడా ముందే రిలీజ్ చేసేస్తున్నట్లు కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. మరి శుక్రవారం జరిగే ‘బింబిసార’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తన కొత్త సినిమా గురించి తారక్ ఏం మాట్లాడతాడు, అభిమానులకు ఏం క్లారిటీ ఇస్తాడు అన్నది ఆసక్తికరం.
This post was last modified on July 27, 2022 2:06 pm
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా.…