టాలీవుడ్ నిర్మాతలు మూకుమ్మడిగా ఆగస్ట్ 1 నుంచి షూటింగుల బందుకు పిలుపునివ్వడం ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా దీని ప్రభావం నేరుగా విడుదల తేదీల మీద పడనుంది. అనుకున్న టైంకి వేసుకున్న షెడ్యూల్స్ కి తగ్గట్టుగా పూర్తి చేస్తేనే రిలీజ్ డేట్లను మీట్ కావడం కష్టంగా ఉంది. అలాంటిది ఉన్నట్టుండి బంద్ అంటే ఎదురుకోవాల్సిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కాల్ షీట్లు, లొకేషన్ల అద్దెలు, అవుట్ డోర్ కోసం ఇచ్చిన అడ్వాన్సులు, డిస్ట్రిబ్యూటర్ల అగ్రిమెంట్లు వగైరా ఎన్నో ఇబ్బందులుంటాయి.
వచ్చే నెలతో మొదలుపెట్టి 2023 జనవరి దాకా విడుదల తేదీ లాక్ చేసుకున్నవాటికి ఇది మరింత తీవ్రం కానుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. పైగా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ బ్యానర్లన్నీ ఇందులో పాల్గొంటున్నాయి. లిస్టులో లేని ఒకటి రెండు ప్రొడ్యూసర్ గిల్డ్ ని కాదని వ్యతికరేకంగా చిత్రీకరణలు జరపలేవు. సో మొత్తం స్తంభించిపోతుంది. కార్మికుల ఉపాధితో పాటు ఆర్టిస్టుల డేట్లు ఇరకాటంలో పడతాయి. ఒకవేళ ఈ బంద్ త్వరగా కొలిక్కి వస్తే సంతోషమే కానీ ఇంకా లేట్ అయితే మాత్రం నరకమే అవుతుంది.
ఇది ఎప్పటిదాకా కొనసాగుతుందనే దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికే టికెట్ రేట్లకు సంబంధించి ఇంకా తగ్గించాలనే కీలక నిర్ణయం తీసేసుకున్నారు. ఆరుగురు స్టార్ హీరోలను మినహాయించి ఇతరుల రెమ్యునరేషన్లు, ఖర్చులతో ముడిపడిన కొన్ని కఠిన ఆంక్షలు తీసుకోవాల్సిన దాని మీద ఇంకా పలు దఫాల చర్చలు జరుగుతాయి. వర్కర్ల వేతనం మీద కూడా ఈ సందర్భంలోనే తేల్చేయాలి. సో నిర్మాత సమాఖ్య పరుగులు పెడుతూ సమావేశాలు నిర్వహిస్తే కానీ ఇవన్నీ కొలిక్కి రావు. చూడాలి ఏం జరగనుందో .
This post was last modified on July 27, 2022 10:05 am
పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…
అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. అధిక శాతం…
దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం…
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…