హఠాత్తుగా ఆగస్ట్ 1 నుంచి షూటింగులు ఆపేయాలని తీసుకున్న నిర్ణయం కేవలం చిత్రీకరణల మీదే కాదు పలురకాలుగా ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా పక్క బాషల ఆర్టిస్టుల డేట్లు తీసుకుని దానికి తగ్గట్టే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న నిర్మాతలు ఇరకాటంలో పడబోతున్నారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ ఫైనల్ షూట్ లో ఉన్నాడు. ఒక ఫైట్ ని హైదరాబాద్ లోనే తీస్తున్నారు. ఇంకా పూర్తవ్వలేదని యూనిట్ టాక్. ఇంకో రెండు మూడు రోజులు సమయం ఉంది కాబట్టి ఆలోగా ఫినిష్ చేస్తే మంచిదే.
ఇది కాకుండా కండల వీరుడు మెగాస్టార్ కాంబినేషన్ లో ఒక పాట షూట్ బాలన్స్ ఉంది. దాన్ని మాత్రం ముంబైలో ప్లాన్ చేసుకున్నారు. షూటింగ్స్ ఆపాలన్నది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమా లేక టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అవుట్ డోర్ లో కూడా చేయకూడదా అనేది చెప్పలేదు కానీ మాములుగా అయితే ఇది రెండింటికి వర్తిస్తుంది. ఇది నిజమైతే గాడ్ ఫాదర్ లో సల్మాన్ పార్ట్ కు సైతం బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే తిరిగి మళ్ళీ డేట్లు తీసుకోవడం పెద్ద సమస్య. ఎందుకంటే సల్లు భాయ్ కమిట్ మెంట్స్ అలాంటివి.
మరోవైపు సల్మాన్ కొత్త మూవీ కభీ ఈద్ కభీ దీవాలి షూట్ సైతం భాగ్యనగరంలోనే జరుగుతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది తెలుగు సినిమా కిందకు రాదు కానీ ఆచార్య సెట్ ని వాడుకుంటున్న తరుణంలో బయటికి వెళ్లి తీయలేరు. అక్కడే పూర్తి చేయాలి. కాకపోతే నిర్మాత హిందీ వాడు కాబట్టి మన ప్రొడ్యూసర్ గిల్డ్ పరిధిలోకి రాడు కానీ ఇక్కడి స్పాట్ లో పని చేయాల్సిన వాళ్లంతా తెలుగువాళ్ళే. మరి సల్మాన్ డేట్లను వీళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on July 27, 2022 9:48 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…