ఎల్లుండి విడుదల కాబోతున్న ది లెజెండ్ మీద తెలుగులో అంచనాలు సున్నా. అటు తమిళంలోనూ ఎగబడి చూసేంత సీన్ కనిపించడం లేదు. సోషల్ మీడియా ట్రోలింగ్ మాత్రం కంటిన్యూ అవుతోంది. హీరో శరవణన్ మూడు రాష్ట్రాలు తిరిగి మరీ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు కానీ బజ్ మాత్రం రావడం లేదు. అరవై కోట్లకు పైగా బడ్జెట్ పెట్టామని నిర్మాత అంటుంటే అంతకంటే చాలా ఎక్కువయ్యిందని నిర్మాణాన్ని దగ్గరి నుంచి చూసినవాళ్లంటున్నారు. ప్యాన్ ఇండియా కాబట్టి ఖర్చు ఇంకా పెరిగింది.
ఇంత చేసినా శరవణన్ ఈ సినిమా ఫలితం పట్ల ఏ మాత్రం టెన్షన్ గా లేరట. ఎందుకంటే ఇది హిట్ అయినా డిజాస్టర్ అయినా ఆయనకు పోయేదేమీ లేదు. పది రూపాయలు పారేసుకుంటే ఎలా అయితే లైట్ తీసుకుంటామో ఒకవేళ లెజెండ్ కనక పెట్టుబడి మొత్తం పోగొట్టినా ఆయన అంతకన్నా లైట్ అనుకుంటారు. కేవలం బిగ్ స్క్రీన్ మీద తనను చూసుకోవాలన్న టార్గెట్ తోనే ఇంత ఖర్చు పెట్టి ది లెజెండ్ తీయించుకున్న శరవణన్ యాభై ఏళ్ళ వయసులో హీరోగా ఏదో పొడిచేయాలనే టార్గెట్ తో వచ్చి ఉండరుగా.
శరవణన్ సంస్థ గ్రూప్ లో సుమారు పది వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. వాళ్లంతా చూసినా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడొచ్చు. వందల మిలియన్ డాలర్ల టర్నోవర్ ఉన్న కంపెనీ అధినేతగా శరవణన్ లెజెండ్ తో ఆపకపోవచ్చని మరో ప్రచారం ఉంది,ఇది ఆడితే వెంటనే కొత్తది మొదలుపెడతారు. లేదూ పోయినా మినిమమ్ హిట్ వచ్చేదాకా నాలుగైదు తీస్తూ పోతారట. అంతేలెండి అంతులేనంత సంపద చేతిలో ఉన్నప్పుడు మనమాడిందే ఆట పాడిందే పాట. చూసేవాళ్ళు దొరకాలి అంతే. ఇంకో రెండు రోజుల్లో ఇదేంటో తేలిపోతుంది
This post was last modified on July 26, 2022 2:38 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…