ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెగాస్టార్ సినిమాల్లో ఎక్కువ అంచనాలు ఉన్నది వాల్తేర్ వీరయ్య మీదే. టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ పలు సందర్భాల్లో చిరంజీవి, దర్శకుడు బాబీ దీని ప్రస్తావన తెచ్చారు కాబట్టి అధికారికంగా చేసే లాంఛనమొకటే మిగిలుంది. రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అంత ఈజీగా చెప్పేలా లేరు. ఇటీవలే దీని షూటింగ్ లో మాస్ మహారాజా జాయిన్ కావడాన్ని ఒక స్పెషల్ వీడియో రూపంలో ప్రమోట్ చేసుకున్న టీమ్ దాన్నుంచి మంచి స్పందనే దక్కించుకున్నట్టు వ్యూస్ ని బట్టి అర్థమైపోయింది.
మాస్ మహారాజా పాత్ర ఎలా ఉంటుందనే దాని మీద కొన్ని లీకులు మెల్లగా బయటికి వస్తున్నాయి. దాని ప్రకారం ఇందులో రవితేజ పాత్ర చిరుకి సవతి తమ్ముడిగా ఉంటుందట. అంటే తండ్రి ఒకరే తల్లులు వేరే కాన్సెప్ట్ తో బాబీ డిఫరెంట్ గా ప్లాన్ చేశారట. ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ కూడా ఓ పవర్ ఫుల్ మాస్ ఎపిసోడ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసే తీరు ఇద్దరి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని ఓ రేంజ్ లో ఊరిస్తున్నారు. ఇదంతా ఓపెన్ గా బయటికి చెప్పలేదు కానీ యూనిట్ మాటల్లో బయటికి వచ్చినట్టుగా తెలిసింది.
గతంలో ఈ తరహా అన్నదమ్ముల క్లాష్ తో వచ్చిన క్లాసిక్స్ అంటే ముందు గుర్తొచ్చేది మణిరత్నం ఘర్షణే. కానీ అందులో ప్రభు కార్తీక్ లు శత్రువుల్లా ఉంటారు. వీరయ్యలో మాత్రం అలా కాకుండా మంచి బాండింగ్ సెట్ చేశారట. రవితేజ పోలీస్ ఆఫీసర్ అనే ప్రచారం కూడా ఉంది కానీ అదెంత వరకు నిజమో తెలియదు. తనకు జోడిగా క్యాథరిన్ త్రెస్సాతో పాటు ఈ జంటకు ఓ చిన్న పాప కూతురిగా నటించబోతోందట. అయితే రవితేజ నిడివి ఎంతనేది మాత్రం బయటికి రాలేదు. నలభై నిమిషాల దాకా ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్.
This post was last modified on July 26, 2022 2:12 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…