థాంక్ యు కోసమని ముందు అనుకున్న రిలీజ్ డేట్ జూలై 22 కాకుండా ఏకంగా ఇరవై రోజులు వాయిదా వేసుకోవడం ఎంత పెద్ద పొరపాటో కార్తికేయ 2 టీమ్ కి ప్రత్యక్షంగా అర్థమవుతోంది. ఒకపక్క చైతు మూవీ దారుణంగా పెర్ఫార్మ్ చేస్తోంది. నిన్న చాలా చోట్ల మల్టీప్లెక్సుల్లో షో క్యాన్సిల్ అయ్యేదాకా వెళ్ళింది. వీకెండ్ ఉన్న మూడు రోజులకు కలిపి పట్టుమని నాలుగు కోట్ల షేర్ రాకపోవడం మరీ దారుణం. ఏ ఆప్షన్ లేకపోతే ఇంట్లో కూర్చోవడమో లేదా రెస్టారెంట్ కో పార్కుకో వెళతాం కానీ బాలేని సినిమాకు వెళ్ళమని ఆడియన్స్ తేల్చేస్తున్నారు.
మరోపక్క షంషేరా ఇంత కన్నా ఘోరంగా దెబ్బతింది . ప్రఖ్యాత యష్ రాజ్ సంస్థ నిర్మించిన ఈ రెండు వందల కోట్ల గ్రాండియర్ దేశవ్యాప్తంగా ఫుల్ రన్ లో కనీసం ఓ నలభై కోట్లయినా తెస్తుందన్న నమ్మకం లేదిప్పుడు. చాలా చోట్ల థియేటర్ల అద్దెలు కూడా వసూలు కావడం లేదు. గత వారం వచ్చిన ది వారియర్ ఆల్రెడీ చేతులు ఎత్తేయగా జనానికి పర్ఫెక్ట్ ఆప్షన్ లేకుండా పోయింది. ఇక్కడే కార్తీకేయ 2 బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ చేసుకుంది. కావాలని కాకపోయినా కారణాలు ఏవైనా సరే దీనికి మూల్యం తప్పేలా లేదు.
ఎందుకంటే ఆగస్ట్ 12 మాచర్ల నియోజకవర్గం ఉంది. మెల్లగా బజ్ పెరుగుతోంది. అంజలి ఐటెం సాంగ్ హిట్ కావడం, పోస్టర్లు గట్రా మాస్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముందు రోజు లాల్ సింగ్ చడ్డా ఉంటుంది. అమీర్ ఖాన్ ఎంత స్పెషల్ గా ప్రమోషన్లు ప్లాన్ చేసుకుంటున్నాడో చూస్తున్నాం. కార్తికేయ 2 బృందం వెరైటీగా టీవీ సీరియల్స్ లో నిఖిల్ క్యామియోలు చేయించి ఫ్యామిలీ ఆడియన్స్ లో హైప్ ని పెంచే ప్రయత్నం చేస్తోంది. ఫస్ట్ ఫిక్స్ చేసుకున్న డేట్ కి అపోజిషన్ వీక్ గా ఉండగా ఇప్పుడు మాత్రం కాంపిటీషన్ టఫ్ గానే కనిపిస్తోంది. వాటిని దాటుకుని కుర్ర హీరో ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి.