కొన్ని నెలల కిందట ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఒకప్పుడు ఒక అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఢిల్లీకి వెళ్తే అక్కడంతా హిందీ చిత్రాలకు సంబంధించిన ఫొటోలే కనిపించాయని, తెలుగు ఫిలిం లెజెండ్స్ ఎవరికీ అక్కడ స్థానం లేదని.. అది చూసి తాను ఎంతో బాధ పడ్డానని.. కానీ ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకుల వల్ల తెలుగు సినిమా తలెత్తుకుని నిలబడుతోందని.. మన సినిమాకు ఇప్పుడు గొప్ప ప్రాధాన్యం దక్కుతోందని పేర్కొన్నాడు.
కాగా ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్వయంగా మన సినిమా ఎదుగుదల గురించి, బాలీవుడ్ ఎంత తగ్గి వ్యవహరించాల్సి వస్తోందనే విషయమై హైదరాబాద్‌లో జరిగిన తన సినిమా లాల్ సింగ్ చడ్డా ప్రెస్ మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో చిరు ఆవేదన గురించి ఆమిర్ ఈ కార్యక్రమంలో ప్రస్తావించడం విశేషం.
హిందీలో సౌత్ సినిమాల హవా గురించి ఒక విలేకరి ఆమిర్‌ను ప్రశ్నించగా అతను బదులిస్తూ.. ‘‘కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు ప్రేక్షకుల మనసులను దోచాయి. ఈ రోజు తెలుగు సినిమా చాలా గొప్ప స్థాయికి ఎదిగింది. దక్షిణాది తారలకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఢిల్లీలో చిరంజీవిని కదిలించిన ఉదంతం గురించి నాకు గుర్తుంది. కానీ ఈ రోజు ఒక హిందీ స్టార్‌గా నేను చిరంజీవి గారి ఆశీర్వాదం కోసం, నా సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చాను. ఒక రాష్ట్రం నుంచి వస్తున్న సినిమాలు దేశవ్యాప్తంగా అందరినీ మెప్పిస్తుండటం గొప్ప విషయం’’ అని పేర్కొన్నాడు.
తాను చిరంజీవి ఆశీర్వాదం, సాయం కోసం వచ్చానని ఆమిర్ పేర్కొనగా.. పక్కనే ఉన్న చిరంజీవి చాలా ఆప్యాయంగా అతణ్ని చూస్తూ దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. ఆమిర్ మాటలు, ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకున్నాయి. చాలా ఏళ్ల పాటు దేశంలో నంబర్ వన్ హీరోగా కొనసాగిన ఆమిర్.. తెలుగు సినిమా గురించి ఈ స్థాయిలో పొగడ్డం గొప్ప విషయమే.
This post was last modified on July 25, 2022 4:04 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…