వేరే సినిమాల ప్రమోషన్ల విషయంలో తన సాయం కోరి ఎవరు వచ్చినా మెగాస్టార్ చిరంజీవి అసలు కాదనట్లేదు ఈ మధ్య. అనధికార ఇండస్ట్రీ పెద్ద పాత్ర పోషిస్తున్న ఆయన.. తాజాగా ఒక హిందీ చిత్రాన్ని తెలుగులో ప్రమోట్ చేసే బాధ్యతను నెత్తికెత్తున్నారు. ఆ చిత్రమే.. లాల్ సింగ్ చడ్డా. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది.
హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించడంతో తెలుగులో దీనికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ఆమిర్ కూడా తెలుగు ప్రమోషన్ల మీద బాగానే దృష్టిపెట్టాడు. చిరంజీవి ఈ సినిమాను సమర్పించేలా ఒప్పించారు. ఇప్పటికే ఆయనకు స్పెషల్ ప్రివ్యూ వేసి సినిమా చూపించారు. ఆదివారం చిరు, చైతూలతో కలిసి ఆమిర్ హైదరాబాద్‌లో మీడియాను కలిసి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. ఆమిర్, చిరు, చైతూ కలిసి ఈ ఈవెంట్లో స్టేజ్ మీద పానీ పూరీలు తినడం విశేషం. లాల్ సింగ్ చడ్డా ట్రైలర్లో ఆమిర్ ట్రైన్లో కూర్చుని పానీ పూరీలు తినే దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. ట్రైన్లో పానీ పూరీలేంటి అని కొందరు కౌంటర్లు వేసినప్పటికీ.. ఆ సీన్ ఆసక్తికరంగా అనిపించింది. ఇప్పుడు ప్రమోషన్ కోసమని ఆ సీన్‌ను రీక్రియేట్ చేశారు. పానీపూరీలు తెప్పించి స్టేజ్ మీదే తిన్నారు.
చైతూ తన పాటికి తాను పూరీ తింటే.. చిరు, ఆమిర్ ఒకరికొకరు తినిపించుకోవడం విశేషం. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమిర్ సొంత బేనర్లో తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డాను అతడి మాజీ మేనేజర్, సీక్రెట్ సూపర్ స్టార్ మూవీతో దర్శకుడిగా మారిన అద్వైత్ చంద్ డైరెక్ట్ చేశాడు. ఇందులో కరీనా కపూర్ కథానాయికగా నటించింది. ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని వివిధ దశల్లో చూపించే సినిమా ఇది. దీని ఒరిజినల్లో టామ్ హాంక్స్ హీరోగా నటించాడు.
This post was last modified on July 25, 2022 7:24 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…