సినిమా హీరోలు ఇంట్లో భార్య ఉన్నా తమతో కలిసి పని చేసే కథానాయికలతో ఎఫైర్లు నడపడం కొత్తేమీ కాదు. ఇలాంటి వ్యవహారాలు ఇండస్ట్రీ జనాలకు చాలా మామూలుగా అనిపిస్తుంటాయి. ఇలాంటి విషయాల్లో ఏవైనా గొడవలు తలెత్తితే అవి నాలుగ్గోడలకే పరిమితం అవుతుంటాయి. కానీ ఒరిస్సాలో ఒక సినిమా హీరో ఎఫైర్ వ్యవహారం రోడ్డు మీదికి వచ్చి రచ్చ రచ్చగా మారింది.
ఆ హీరో పేరు.. బబూషన్ మొహంతి. అతను ప్రకృతి మిశ్రా అనే స్టార్ హీరోయిన్‌తో ఒక సినిమాలో కలిసి నటించాడు. ప్రకృతి అక్కడ ఫేమస్ హీరోయినే. ఈ సినిమాలో కలిసి నటించిన సందర్భంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అక్కడి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఐతే బబూషణ్‌కు ఆల్రెడీ పెళ్లయింది. తన భార్య పేరు తృప్తి సత్పతి. ఆమెకు బబూషణ్, ప్రకృతిల వ్యవహారం తెలిసి ఫాలో అప్ చేయడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి కార్లో భువనేశ్వర్లో తిరుగుతున్నట్లు తెలుసుకుంది.
ఆలస్యం చేయకుండా బబూషణ్, ప్రకృతి ఉన్న చోటికి వచ్చేసి ఇద్దరినీ కార్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందామె. నడి రోడ్డు మీద కారు ఆపి, కార్లోకి దూరిన తృప్తి.. నా భర్తతో ఎఫైర్ పెట్టుకుంటావా అని ప్రకృతితో గొడవకు దిగింది. ఆమె జుట్టు పట్టుకుని లాగుతూ, కొడుతూ దుర్భాషలాడింది. అంతలో అక్కడికి జనం వచ్చారు. సెలబ్రెటీ వ్యవహారం కావడంతో వీడియోలు తీయడం మొదలుపెట్టారు.
అందులో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో ప్రకృతి జుట్టు పట్టుకుని లాగుతూ తృప్తి దుర్భాషలాడుతున్న దృశ్యం కనిపించింది. ఆమె నుంచి తప్పించుకుని ప్రకృతి పరుగులు తీయడం.. తన వెంట తృప్తి పరుగులు పెట్టడం, ప్రకృతి ఆటో ఎక్కి అక్కడి నుంచి పలాయనం చిత్తగించడం కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తృప్తి చేసింది కరక్టే అని కొందరంటే.. మరీ రోడ్డు మీద ఇలా గొడవ పడడమేంటి అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై సదరు హీరో మీడియాకు ఏమని బదులిస్తాడో చూడాలి.
This post was last modified on July 25, 2022 7:23 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…