Movie News

బాక్సాఫీస్.. ఎవ్వరినీ వదలట్లేదు

టాలీవుడ్‌లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన పెద్ద పెద్ద నిర్మాతలకు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర చుక్కలు కనిపిస్తున్నాయి. మంచి సక్సెస్ రేట్ మెయింటైన్ చేేసే బేనర్లు.. జడ్జిమెంట్ కింగ్స్ అని పేరున్న నిర్మాతలకు ఇప్పుడు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. కొవిడ్ తర్వాత చాలా ప్రమాదకరంగా తయారైన బాక్సాఫీస్ ఎవ్వరినీ వదలట్లేదు. ఆషామాషీగా సినిమాలు తీయని, ఏ చిత్రం తీసినా సేఫ్ గేమ్ ఆడే ప్రొడ్యూసర్లకు ఇప్పుడు ఊహించని పరాభవాలు ఎదురవుతున్నాయి.

టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ ప్రొడ్యూసర్ అనదగ్గ దిల్ రాజు సంగతే చూస్తే.. ఆయనకు ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ ఎదురు కాని పరాజయాలు ఇటీవల కాలంలో ఎదురయ్యాయి. ఓవైపు ‘ఎఫ్-3’ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. తన రెగ్యులర్ బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది. ఆ నష్టాల్ని భర్తీ చేద్దామని ‘థాంక్యూ’ సినిమాను కొంచెం తక్కువ రేట్లకు ఇస్తే.. ఆ మొత్తం కూడా రికవర్ కాని పరిస్థితి. దిల్ రాజు కెరీర్లో ఫ్లాపులు లేవని కాదు కానీ.. ‘థాంక్యూ’ మరీ దారుణంగా పెర్ఫామ్ చేస్తూ ఆయన జడ్జిమెంట్‌ను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇలాంటి సినిమాను ఆయన ఎలా ఓకే చేశారనే ప్రశ్నను రేకెత్తిస్తోంది.

‘థాంక్యూ’ కంటే ముందు హిందీలో రిలీజైన ‘హిట్’ సీక్వెల్ సైతం దిల్ రాజుకు పెద్ద షాకే. అంతకుముందు ఆయన ‘జెర్సీ’తోనూ చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఇలా కొన్ని నెలల వ్యవధిలో రాజుకు నాలుగు పెద్ద షాకులు తగిలాయి. మరోవైపు ఇంకో టాప్ ప్రొడ్యూసర్, దిల్ రాజు లాగే జడ్జిమెంట్ విషయంలో తిరుగులేదు అని పేరున్న అల్లు అరవింద్ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ఆయన బేనర్ నుంచి తాజాగా వచ్చిన ‘పక్కా కమర్షియల్’ పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో గీతా పేరు బాగా దెబ్బ తింది. అంతకుముందు ‘చావు కబురు చల్లగా’ ఆ బేనర్‌కు మరో పెద్ద షాక్. మధ్యలో వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ దసరా టైమింగ్, వేరే కారణాలు తోడై ఓ మోస్తరుగా ఆడేసింది కానీ.. కంటెంట్ పరంగా అది కూడా గీతా వారి బ్రాండును దెబ్బ తీసే చిత్రమే.

ఇక ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక చిత్రాలు నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్‌కు కూడా షాకులు తప్పట్లేదు. తాజాగా ఆ బేనర్ నుంచి వచ్చిన చిన్న సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’ వీకెండ్లోనే అడ్రస్ లేకుండా పోయింది. దాని కంటే ముందు ‘సర్కారు వారి పాట’ వారికి నష్టాలు మిగిల్చింది. మధ్యలో ‘అంటే సుందరానికీ’ కూడా వారికి నిరాశను మిగిల్చింది. ఇక మరో అగ్ర నిర్మాత సురేష్ బాబు ఆచితూచి సినిమాలు చేస్తున్నా సమస్యలు తప్పట్లేదు. రీమేక్‌లు అయిన నారప్ప, దృశ్యం-2 చిత్రాలను ఆయన ఓటీటీల్లో ఇచ్చేసి బయటపడ్డారు. కానీ ‘విరాటపర్వం’ ఆయనకు దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. అసలే సినిమాల నిర్మాణం బాగా తగ్గించేసిన ఆయన ఈ దెబ్బతో ఇంకా స్లో అయిపోయేలా కనిపిస్తున్నారు.

This post was last modified on July 27, 2022 10:10 am

Share

Recent Posts

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

21 minutes ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

1 hour ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

6 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

6 hours ago

శర్వానంద్ రిలీజులకు కొత్త చిక్కుముడి

శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…

6 hours ago

ఊర్మిళను పెళ్లాడిన వర్మ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…

6 hours ago