మొన్నటిదాకా డైరెక్ట్ ఓటిటి రిలీజులంటే ఉన్న చిన్నచూపు రెండు రోజుల క్రితం ప్రకటించిన జాతీయ అవార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వమే తగ్గించడం అప్ కమింగ్ ఫిలిం మేకర్స్ కి కొండంత ఉత్సాహాన్ని ఇస్తోంది.
కలర్ ఫోటోకి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా పురస్కారం దక్కడం, ఆకాశం నీ హద్దురా(సూరారై పోట్రు)కు హీరో సూర్యతో పాటు మొత్తం అయిదు విభాగాల్లో ఈ గౌరవం దక్కడం రాబోయే రోజుల్లో డిజిటల్ విడుదలకు అర్థాన్ని మార్చేలా ఉంది. థియేటర్లో రాకపోయినా మన సత్తా ప్రపంచానికి చాటవచ్చనే నమ్మకాన్ని కలిగించింది.
కలర్ ఫోటో తీసింది చాలా చిన్న టీమ్. దర్శకుడు సందీప్ రాజ్ కొత్తవాడు. నిర్మాత రాజేష్ కున్న అనుభవమూ తక్కువే. ఇక కథానాయకుడు సుహాస్ అప్పటిదాకా చేసింది సపోర్టింగ్ రోల్సే. షార్ట్ ఫిలింస్ లో నటించే చాందిని చౌదరి హీరోయిన్. ఇన్ని అంశాల్లో రాజీ పడిన ఈ సినిమాలో కంటెంట్, దాన్ని ప్రెజెంట్ చేయడంలో నిజాయితీ నేషనల్ కమిటీని మెప్పించింది. ఊహించని స్థాయిలో సత్కరించింది. ఆకాశం నీ హద్దురా అంటే సూర్య లాంటి స్టార్ హీరో, సుధా కొంగర లాంటి ప్రూవ్డ్ డైరెక్టర్ కాబట్టి కలర్ ఫోటోతో పోల్చలేం.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. దమ్మున్న కథలు మెప్పించే కథనాలు మనదగ్గరుంటే ఎక్కడైనా విజయం సాధించవచ్చు అనేదానికి ఇవే ఉదాహరణలు. బిగ్ స్క్రీన్ మీద పేరు చూసుకుంటే చాలనుకునే దర్శక నిర్మాతలెందరో రిస్కులు చేసి థియేట్రికల్ బిజినెస్ లో నష్టాలు తెచ్చుకుంటున్నారు. అందరూ సక్సెస్ కాలేకపోతున్నారు. అలాంటి వాళ్లకు కలర్ ఫోటో విజయం స్ఫూర్తినిచ్చేదే. 2021 లిస్టులో ఖచ్చితంగా జైభీమ్ తో పాటు మరికొన్ని ఓటిటి రిలీజులు అవార్డులు గెలవడం ఖాయమనే క్లారిటీ వచ్చేసింది. రాబోయే రోజుల్లో దీన్నింకా బాగా అర్థం చేసుకోవాల్సింది అప్ కమింగ్ ప్రొడ్యూసర్లే.
This post was last modified on July 25, 2022 6:55 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…