Movie News

‘ఇంద్ర’ సింహాసనానికి 20 ఏళ్ళు

2001 సంవత్సరం. మెగాస్టార్ చిరంజీవికి కొంత బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. అన్నయ్య సూపర్ హిట్ తర్వాత మృగరాజు ఘోరంగా దెబ్బేసింది. శ్రీమంజునాథలో శివుడి వేషంతో నాగార్జునకు అన్నమయ్య తెచ్చినంత పేరు ఇస్తుందని ఆశిస్తే అదీ కోరుకున్న ఫలితం తేలేకపోయింది. ఇక డాడీ సంగతి సరేసరి. తమ అభిమాన హీరో నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకోవడం, ఏమి చేయలేక జైల్లో కూర్చుకోవడం ఫ్యాన్స్ దాకా ఎందుకు సాధారణ ప్రేక్షకులకే నచ్చలేదు. దెబ్బకు మరో ఫ్లాప్. హ్యాట్రిక్ తో చిరు మళ్ళీ వెనక్కు వెళ్లేలా ఉన్నారు.

దీంతో అభిమానులు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లి ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారని అల్లు అరవింద్ ని నిలదీసే దాకా వెళ్ళింది పరిస్థితి. అప్పుడాయన సముదాయించి ఇంకొక్క ఏడాది ఆగమన్నారు. వాళ్ళు నమ్మారు. ఆ నమ్మకం నూటికి వెయ్యి శాతం నిజమయ్యింది. నిర్మాత ఆయన కాకపోయినా బి గోపాల్ దర్శకత్వంలో అశ్వినిదత్ ఆవిష్కరించబోతున్న అద్భుతం గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. నిర్మాణంలో ఉన్నప్పుడు రషెస్ చూసి లిఖించబోయే చరిత్రను ముందే పసిగట్టారు. అదే ఇంద్ర.

రజనీకాంత్ కు నరసింహ లాంటి ఎవర్ గ్రీన్ స్టోరీ ఇచ్చిన చిన్నికృష్ణ కథకు పరుచూరి బ్రదర్స్ సంభాషణలతో వైజయంతి బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఇంద్ర ఇవాళ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. 2002 జూలై 24న ఈ సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద జన సునామీని చూసి ఎవరికీ నోట మాట రాలేదు. టికెట్ల కోసం మంత్రులు ఫోన్ చేయాల్సి వచ్చేది. ఆడియో క్యాసెట్లను సైతం బ్లాక్లో అమ్మాల్సి వచ్చిందంటే ఇంద్ర తాలూకు ప్రభావం అప్పటి జనం మీద ఎంత బలంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు.

అప్పటికే ఫ్యాక్షన్ జానర్ లో బాలయ్య సమరసింహారెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు ఇంద్రలో చిరంజీవి విశ్వరూపానికి సైతం జేజేలు కొట్టారు. సోనాలి బింద్రే-ఆర్తి అగర్వాల్ గ్లామర్, సెకండ్ హాఫ్ లో నడిచే ఊర మాస్ సీమ ఫ్లాష్ బ్యాక్, విజిల్స్ తో స్పీకర్లు పగిలిపోయేలా ఇచ్చిన మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వెరసి వంద రోజులు దాటిన తర్వాత కూడా క్లాస్ మాస్ తేడా లేకుండా అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు తీయనివ్వలేదు. ఎక్కడ చూసినా రికార్డుల ఊచకోతే. కొన్ని వారాల పాటు సినిమా మ్యాగజైన్లలో ఇంద్ర గురించిన వార్తలే.

మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా, తలవంచుకుని వెళ్తున్నా లేదంటే తలలు తీసుకెళ్లేవాడిని, నేనున్నాను నాయనమ్మా లాంటి సంభాషణలు అసలైన గూస్ బంప్స్ కు అర్థాన్ని చెప్పాయి. ముఖ్యంగా దాయి దాయి దామ్మా పాటలో లారెన్స్ తో చిరుతో వేయించిన వీణ స్టెప్పుకి థియేటర్ పైకప్పులు ఎగిరిపోయేలా అభిమానులు అల్లరి చేయడం అప్పటి వాళ్లకు గుర్తే. కర్నూలు జిల్లా ఆదోని లాంటి చిన్న సెంటర్లో కేవలం 30 రూపాయల టికెట్ రేట్ తో 247 రోజులకు గాను 52 లక్షలు పైగా వసూలు చేయడం బి సెంటర్స్ లో ఇప్పటికీ రికార్డే.

స్టేట్ రౌడీ సూపర్ హిట్ ఇచ్చినా మెకానిక్ అల్లుడు రూపంలో డిజాస్టర్ అందుకున్న దర్శకుడు బి గోపాల్ ఇంద్రతో ఎప్పటికి మర్చిపోలేని మాస్ ఎపిక్ ని మెగాస్టార్ కి కానుకగా ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కాశిలోనే షూట్ చేశారు. షౌకత్ అలీ ఖాన్ ఎపిసోడ్ ఇప్పటికీ చిరు వన్ అఫ్ ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు. చిరు నటన ప్రభుత్వమూ గుర్తించింది. నంది అవార్డుతో సత్కరించింది. 32 కేంద్రాల్లో 175 రోజులు ఆడటం ఒక హిస్టరీ. 10 కోట్ల బడ్జెట్ తో రూపొంది 40 కోట్ల వసూలు చేసిన ఇంద్రను తిరిగి 2006లో మహేష్ బాబు పోకిరి క్రాస్ చేసే దాకా ఆ రికార్డులు భద్రంగా ఉన్నాయి.

This post was last modified on July 24, 2022 12:38 pm

Share

Recent Posts

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…

26 minutes ago

మార్క్ మామా… మోదీజీకి సారీ చెప్పాల్సిందే

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…

1 hour ago

పైసా ప్రమోషన్ లేకుండా స్పైడర్‌మ్యాన్ బీభత్సం

గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…

2 hours ago

క్రేజీ దర్శకుడు హీరో అయితే సౌండ్ లేదేంటి

లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…

3 hours ago

జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ నిరసన

బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…

3 hours ago

ఫౌజీ ప్లానింగ్ విభిన్నంగా ఉంటుందా?

డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…

3 hours ago