ఒకప్పుడు శాటిలైట్ ఛానల్ లో వచ్చిన కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం ఇంటర్వ్యూలలోనే ఒక కొత్త ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన మాట వాస్తవం. దాని స్ఫూర్తితోనే తెలుగులోనూ మంచు లక్ష్మి, రానాలాంటి వాళ్ళు సెలబ్రిటీ ముఖాముఖీలతో మంచి పేరు తెచ్చుకున్నారు . దీన్నే ఇప్పుడు కరణ్ జోహార్ డిస్నీ హాట్ స్టార్ కోసం ఓటిటిలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఊరికే స్టార్లను తీసుకొచ్చి మాట్లాడిస్తే జనం చూడరని గుర్తించిన మేకర్స్ దానికి అదనంగా ఎవరిని తీసుకొచ్చి ఎలాంటి ప్రశ్నలు అడిగితే వైరల్ అవుతుందో అవే చేస్తున్నారు.
అందుకు తగ్గట్టే సమంతా ఎపిసోడ్ ఓ రేంజ్ లో హిట్టు కొట్టి మిలియన్ల వ్యూస్ తెచ్చిపెడుతోంది. ఇటీవలే స్ట్రీమింగ్ జరిగిన ఈ ఎపిసోడ్ కి మాములు రీచ్ రాలేదు. ముఖ్యంగా మన తెలుగు ఫ్యాన్స్ సైతం ఎగబడి చూస్తున్నారు. దానికి కారణం విడాకులు తీసుకున్నాక సామ్ వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలను ఓపెన్ గా కెమెరా ముందు ప్రస్తావించిన కార్యక్రమం ఇదే. చైతుని మాజీ భర్తని సంబోధించడం, విడిపోయాక లైఫ్ పట్ల తనకెలాంటి దృక్పథం వచ్చిందో సమంతా వివరించడం ఇదంతా రీచ్ పెంచుతోంది
అంతే కాదు అక్షయ్ కుమార్ తో కలిసి చేసిన పుష్పలో ఊ అంటావా ఊహూ అంటావా డాన్స్ బిట్ సైతం వీడియో రూపంలో ఎక్కడికో వెళ్లిపోయింది. మీడియాని కలవాల్సి వచ్చినప్పుడు నాగచైతన్య గతాన్ని గుర్తుచేసుకునేందుకు ఇష్టపడకపోగా సామ్ మాత్రం చాలా స్పష్టంగా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పేయడం విశేషం. అయినా ఎప్పుడో జరిగిపోయిన తెగతెంపుల పంచాయితీ ఆయా కుటుంబాలకు అవసరం లేకపోయినా ఆదాయం కోసం యాప్స్ కి, టైం పాస్ కి నెటిజెన్లకు కావాలి. ఆ ఉద్దేశాలు ఇదిగో ఈ విధంగా నెరవేరుతున్నాయి.
This post was last modified on July 24, 2022 12:24 pm
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…