కరోనా మహమ్మారి పేరుమోసిన సెలబ్రెటీల్ని కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. బాలీవుడ్లో ఇప్పటికే కరోనా దెబ్బకు వాజిద్ ఖాన్ లాంటి ప్రముఖ సంగీత దర్శకుడు ప్రాణాలు విడిచాడు. అతడి తల్లికి కూడా కరోనా సోకి బాగా ఇబ్బంది పడింది. కరోనా వల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పెద్ద వయస్కులకు ప్రమాదం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. రెండు రోజులుగా తెగ టెన్షన్ పడుతున్నాడు. అతడి స్టాఫ్‌లో కొంతమందికి కరోనా సోకడం.. వారికి చికిత్స అందిస్తుండటం తెలిసిన సంగతే. ఈ విషయాన్ని వెల్లడించిన ఆమిర్.. తన తల్లిని కూడా కరోనా పరీక్షకు పంపుతున్నామని.. ఆమె కోసం అందరూ ప్రార్థించాలని ట్విట్టర్లో విజ్ఞప్తి చేశాడు. కరోనా పరీక్షకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఆ పరీక్ష ఫలితం వచ్చే వరకు విపరీతమైన టెన్షన్‌గానే ఉంటుంది. ఆమిర్ కూడా అలాగే టెన్షన్ పడ్డాడు.
ఐతే ఇప్పుడతడి టెన్షన్ మొత్తం తీరిపోయింది. ఆమిర్ తల్లి కరోనా పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆమెకు వైరస్ సోకలేదని తేలింది. తన తల్లికి కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చినట్లు ఆమిర్ ట్విట్టర్లో చాలా సంతోషంగా ప్రకటించాడు. దీంతో ఆమిర్ ఖాన్ కుటుంబ సభ్యులతో పాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తన తల్లికి కరోనా నెగెటివ్ రావడంతో చాలా ఉపశమనంగా ఉందని.. తన తల్లి క్షేమంగా ఉండాలని ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని ట్విట్టర్లో పేర్కొన్నాడు ఆమిర్. ఇక కరోనా సోకిన ఆమిర్ సిబ్బందిలో అందరినీ హోం క్వారైంటన్లోనే పెట్టారు. ఎవరికీ తీవ్ర సమస్యలు లేకపోవడంతో వైద్యుల పర్యేవక్షణలో వారంతా ఇంట్లోనే ఉండి మందులేసుకుంటూ, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరి చికిత్స, ఇతర ఖర్చులన్నీ ఆమిరే చూస్తున్నట్లు సమాచారం.
This post was last modified on July 1, 2020 11:36 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…