తన అభిమానుల కోసం ప్రభాస్ ఒళ్ళు హూనం చేసుకుంటూ పగలు రేయి తేడా లేకుండా ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగైదు సినిమాలు ఒప్పేసుకుని నాన్ స్టాప్ గా కష్టపడటం అందరం చూస్తున్నాం. కానీ తమ హీరో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా సరైన రీతిలో వాటి ప్రమోషన్లు జరగకపోవడం పట్ల ఫ్యాన్స్ ఎప్పటి నుంచి అసంతృప్తికి గురవుతూనే ఉన్నారు. ఆది పురుష్ షూటింగ్ పూర్తయిందన్నారు. కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో ఇవాళ సోషల్ మీడియాలో మేలుకో ఓంరౌత్ అంటూ కొత్త తరహా ట్రెండింగ్ మొదలుపెట్టారు.
ఇక్కడితో ఆగిపోలేదు. ఇండస్ట్రీకి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కృష్ణంరాజు గారని ఆయన తర్వాత పెదనాన్న వారసత్వాన్ని అందిపుచ్చుకుని రెబెల్ స్టార్ బిరుదుకి న్యాయం చేకూరుస్తున్నది ప్రభాస్ ఒక్కడేనని ఛత్రపతి, బిల్లా తదితర సినిమాల వీడియోలను ట్వీట్ చేస్తున్నారు. కొందరు ఏకంగా విక్రమ్ మూవీలోని సూర్య రోలెక్స్ ట్రాక్ ని డార్లింగ్ కి వాడేసి మరీ ఎలివేషన్లు ఇస్తున్నారు. సాహో, రాధే శ్యామ్ ల ఫలితాల తర్వాత బాగా నిరాశలో ఉన్న ఫ్యాన్స్ చేస్తున్న ఈ హంగామా వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాల్సింది నిర్మాతలే.
ఈ క్యాంపైన్ లో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం ఒకటుంది. 2023 సంక్రాంతికి ఆది పురుష్ లేదా సలార్ లో ఏదో ఒకటి రిలీజ్ అవుతుందా లేదానే క్లారిటీ ఇస్తే దానికి తగ్గట్టు సిద్ధపడతామని అడుగుతున్నారు. కానీ రెండు యూనిట్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అప్పుడప్పుడు తన ఇంటికి వచ్చిన హీరో ఫోటోలు పెట్టడం తప్ప ఓంరౌత్ చేస్తున్నదేమి లేదు. కెజిఎఫ్ వచ్చి 100 రోజులు దాటాక కూడా ప్రశాంత్ నీల్ సలార్ మూవీ గురించి నోరు విప్పడం లేదు. మరి అభిమానులు ఈ మాత్రం ఫైర్ అవ్వడంలో తప్పేం లేదుగా.
This post was last modified on July 26, 2022 8:53 am
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…