అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా మీద మాములు అంచనాలు లేవు. ఇప్పటికే బిజినెస్ డీల్స్ హాట్ హాట్ గా జరుగుతున్నాయని ట్రేడ్ రిపోర్ట్. మైత్రి నిర్మాతలు ఇంకా క్లోజ్ చేయలేదు కానీ బయ్యర్లు మాత్రం ఫ్యాన్సీ ఆఫర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం దీని షూటింగ్ కర్నూలుతో పాటు పరిసర గ్రామాల్లో రెండు రోజులుగా జరుగుతోంది. ఎన్నో ఏళ్ళ తర్వాత అన్నగారి వారసుడు రావడంతో అక్కడి అభిమానులను ఆపడం పోలీసులతో సహా ఎవరి వల్ల కావడం లేదు
సరే ఆయనా ఫ్యాన్స్ కదాని నో అనకుండా దగ్గరికొచ్చిన వాళ్ళకు ఫోటోలు ఇస్తున్నారు. షూట్ జరుగుతున్న ప్రాంగణంలో అనుమతిస్తున్నారు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. చిత్రీకరణకు సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు ఎంచక్కా సోషల్ మీడియాలో తిరిగేస్తున్నాయి. ఇవాళ ‘జై బాలయ్య జై జై బాలయ్య’ అంటూ వందలాది డాన్సర్ల మధ్య నడుచుకుంటూ వచ్చే పాటని పూడిచర్ల గ్రామ పరిసరాల్లో తీస్తున్నారు. ఇంకేముంది అత్యుత్సాహంతో ఓ అభిమాని తీసిన వీడియో బయటికి వచ్చి చక్కర్లు కొడుతోంది. గతంలో ఇక్కడే సమరసింహారెడ్డి షూటింగ్ చేశారు.
అసలే జై బాలయ్య అనే టైటిల్ దీనికి ఫిక్స్ చేస్తారనే లీక్ ఎప్పుడో వచ్చింది. దానికి బలమిచ్చేలా ఇప్పుడీ వీడియోలో స్పష్టంగా వినిపించేలా ఆడియో కూడా బయటికి రావడంతో అదే ఖాయం చేశారేమో అనిపిస్తోంది. అయినా స్పాట్ లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి లీకులు ఎవరికైనా తప్పవు. విపరీతమైన ఆంక్షలు పెట్టినా కూడా రాజమౌళి అంతటి వారే ఆర్ఆర్ఆర్ లీక్స్ బయటికి రాకుండా ఆపలేకపోయారు. అయినా ఈ బాలయ్య సినిమాకు ముందు నుంచి ఇదే జరుగుతోంది.రెండు నెలల క్రితం ఫస్ట్ లుక్ అఫీషియల్ గా బయటికి రాకుండానే లీకవ్వడంతో మేకర్స్ అధికారికంగా అనుకున్న టైంకన్నా కాస్త ముందుగానే వదలాల్సి వచ్చింది. తప్పదు మరి
This post was last modified on July 24, 2022 10:48 am
మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా…
బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్…
నితిన్ లేటెస్ట్ రిలీజ్ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ఫలితం చేదుగా వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా, డేవిడ్ వార్నర్…
టాలీవుడ్ శ్రీవల్లిగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్న మూడు బ్లాక్ బస్టర్లు యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావాలతో…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాగర నగరం విశాఖపట్టణం…
ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం…