జనాలు ఎలాంటి సినిమాలకు థియేటర్లకు వస్తారో అర్థం కాక తలలు పండిన నిర్మాతలే బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటే మరోవైపు చిన్నా చితకా చిత్రాలు ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ మీద దాడి చేస్తూనే ఉన్నాయి. తాము కొనాలంటే ఖచ్చితంగా హాళ్లలో రిలీజ్ అయ్యుండాలనే కొన్ని ఓటిటిల కండీషన్లు కావొచ్చు, లేదా ఏ పుట్టలో ఏ పాముందో తరహాలో ఆడుతుందేమోననే నమ్మకం ఉండొచ్చు ఏదైతేనేం ఎగ్జిబిటర్లకు ప్రేక్షకులకు నాలుగైదు ఆప్షన్లు ఉండేలా ప్రతి ఫ్రైడే విడుదల లిస్టు పెరుగుతూ పోతోంది. వాటిలో వచ్చిందే నిన్నటి దర్జా.
అనసూయని విలన్ ని చేసి హీరో హీరోయిన్ లేకుండా ఆమెనే సర్వంగా చూపిస్తూ దర్శకుడు సలీం మాలిక్ చేసిన విచిత్ర ప్రయోగమిది. సునీల్ ని ఒక ప్రత్యేక పాత్రలో తీసుకుని కొంచెం బజ్ జోడించే ప్రయత్నం చేశారు. పుష్పలో జంటగా చేశారు కాబట్టి ఇందులో కూడా ఏదో ఒక రూపంలో కాంబోగా చేస్తే మాస్ అట్రాక్ట్ అవుతారనే ఆలోచన కావొచ్చు. మొత్తానికి దర్జా కేవలం మాస్ ని టార్గెట్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగచైతన్య అంత స్టార్డం ఉన్న హీరోకే నిన్న ఓపెనింగ్స్ లేవంటే పెద్దగా అంచనాలే లేని దర్జాకు ఎలా ఉంటాయో వేరే చెప్పాలా.
ఓ ఇరవై ఏళ్ళ క్రితం రియల్ స్టార్ శ్రీహరి ఇలాంటి ఊరనాటు సినిమాల్లో నటించేవారు. కాకపోతే ఆయన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల కథా కథనాల క్వాలిటీ కొంచెం అటుఇటుగా ఉన్నా కమర్షియల్ గా సక్సెస్ సాధించినవే ఎక్కువ. కానీ దర్జాకు ఆ అవకాశం లేదు. ఒక లేడీ డాన్, ఆమె తమ్ముడి చావు, దాన్ని చుట్టూ మర్డర్ మిస్టరీ, అది ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్. ఇందులో ఇదే మెయిన్ పాయింట్. అనసూయ సునీల్ లు ఎంత కష్టపడినా అసలు మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడు మాస్ కైనా నచ్చే ఛాన్స్ ఎక్కడుంటుంది. వీళ్లిద్దరి కోసం ఎలా ఉన్నా చూస్తాం అనే వీరాభిమానుల తప్ప దర్జా ఎవరికీ ఛాయస్ గా కనిపించడం లేదు,
This post was last modified on July 24, 2022 10:45 am
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…