తొలి సినిమా అందాల రాక్షసితోనే తన అభిరుచిని చాటుకున్న దర్శకుడు హను రాఘవపూడి. ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రెండో చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ కూడా మెప్పించింది. కానీ ఆ తర్వాత అతను తీసిన ‘లై’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలు పెద్ద డిజాస్టర్లయ్యాయి. అయినా వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బేనర్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా లాంటి మంచి కాస్టింగ్‌తో కాస్త పెద్ద బడ్జెట్లోనే సినిమా చేసే అవకాశం దక్కింది. ఆ చిత్రమే.. సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా మీడియాను కలిసిన హను.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అతను బాలీవుడ్‌లో సన్నీ డియోల్, నవాజుద్దీన్ సిద్దిఖిలతో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నాడట. అలాగే అమెజాన్ ప్రైమ్ వాళ్లతో ఒక వెబ్ సిరీస్ ప్లానింగ్‌లో ఉన్నట్లు హను వెల్లడించాడు.
హను ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే.. బాలీవుడ్లో ఇలాంటి పెద్ద సినిమా.. అమేజాన్ వాళ్లతో వెబ్ సిరీస్‌లో అవకాశం రావడం విశేషమే. ఐతే ముందు సీతారామంతో అతను మంచి హిట్ కొట్టాల్సిన అవసరముంది. సీతారామం కథ ఎలా పుట్టిందనే విషయంలోనూ హను ఆసక్తికర కథ చెప్పాడు. “నాకు కోఠి వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు వుంది. అలా కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఓపెన్ చేయని లెటర్ అది. అది ఓపెన్ చేస్తే పెద్ద మేటర్ ఏమీ లేదు. ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం వుండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా వుండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ ఆలోచననే కథగా రాశా. సీతారామం పూర్తిగా ఫిక్షన్. ఇందులో రెండు టైం పీరియడ్స్ వున్నాయి. 1964 కథ టేకాఫ్ పిరియడ్. స్క్రీన్ ప్లే వర్తమానానికి, గతానికి నడుస్తూ ఉంటుంది” అని హను వెల్లడించాడు.
This post was last modified on July 24, 2022 10:38 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…