Movie News

సౌత్ సినిమాను నెత్తిన పెట్టుకున్నారే..

ఒకప్పుడు జాతీయ అవార్డులు ప్రకటిస్తుంటే.. దక్షిణాది చిత్రాలకు ఎక్కడైనా కాస్త చోటు దక్కుతుందా అని చూసేవాళ్లు ప్రేక్షకులు. తెలుగు నుంచి అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఏదో ఒక సినిమాను ప్రకటిస్తేనే మురిసిపోయేవాళ్లు. కొన్నిసార్లు అందుకు కూడా ఏ సినిమాకూ అర్హత లేదని అది ప్రకటించని సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక ఓవరాల్ అవార్డుల్లో తెలుగు సినిమాలకు ఎప్పుడో కానీ ప్రాధాన్యం దక్కేది కాదు. మొత్తంగా సౌత్ సినిమా మీదే శీతకన్నేసినట్లు కనిపించేది.

అప్పుడప్పుడూ మలయాళ సినిమాలు ప్రాధాన్యం చాటుకునేవి. తమిళ చిత్రాలు కూడా ఎప్పుడో ఒకసారి మెరిసేవి. బాలీవుడ్ సినిమాలకు మాత్రం అవార్డులే అవార్డులు అన్నట్లుండేది. అలా అని హిందీలో మరీ గొప్ప సినిమాలేమీ వచ్చేవి కావు. అవార్డులు వచ్చిన హిందీ చిత్రాలతో పోలిస్తే.. వాటికి దీటుగా నిలిచే సినిమాలు సౌత్‌లో ఉన్నా సరే.. పట్టించుకునేవారు కాదు. ఈ విషయంలో మన వాళ్లు చాలా ఫీలయ్యేవాళ్లు.

కానీ ఇప్పుడు కథ మారింది. జనాల ఆలోచనలకు తగ్గట్లే ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకుంటాయనడానికి ఈ ఏడాది ప్రకటించిన జాతీయ అవార్డులే ఉదాహరణ. గత కొన్నేళ్లలో సౌత్ సినిమా దేశవ్యాప్తంగా ఎలా మెరుపులు మెరిపిస్తున్నాయో తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బ తింటుంటే.. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి సినిమాలు వసూళ్ల పంట పండించుకున్నాయి. దేశవ్యాప్తంగా వాటికి గొప్ప ఆదరణ దక్కింది. సౌత్ సినిమా గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరూ మాట్లాడుకున్నారు. సినిమాల విషయంలో జనాల మూడ్ ఏంటో కూడా అందరికీ అర్థమైంది. జాతీయ అవార్డుల జ్యూరీకి కూడా పరిస్థితి బోధ పడి.. సౌత్ సినిమాను విస్మరించలేని పరిస్థితి తలెత్తింది.

ఎన్నడూ లేనంత ప్రాధాన్యం కల్పిస్తూ.. దక్షిణాది చిత్రాల మీద అవార్డుల వర్షం కురిపించారు. ఉత్తమ చిత్రం (సూరారై పొట్రు), ఉత్తమ దర్శకుడు (సాచి-అయ్యప్పనుం కోషీయుం), ఉత్తమ నటుడు (సూర్య), ఉత్తమ నటి (అపర్ణ బాలన్), ఉత్తమ సంగీత దర్శకుడు (తమన్).. ఇలా చాలా ముఖ్యమైన అవార్డులన్నీ సౌత్ వాళ్లకే దక్కాయి. వీళ్లందరూ అందుకు నూటికి నూరు శాతం అర్హులే. కానీ ఒకప్పుడు ఇలా అర్హత ఉన్నా దక్షిణాది వాళ్లను పక్కన పెట్టేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ఉదాహరణకు తమన్ సంగతే తీసుకుంటే.. సోషల్ మీడియా పుణ్యమా అని ‘అల వైకుంఠపురములో’ పాటలు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి కాబట్టే అతడి ప్రతిభను గుర్తించారు. అలా కాకుండా అవి తెలుగు రాష్ట్రాల అవతల అంత పాపులర్ కాకపోతే అవార్డు ఇచ్చేవారా అన్నది సందేహమే. దీన్ని బట్టి ప్రతిభ కంటే పాపులారిటీ చూస్తున్నారన్నది స్పష్టం. మొత్తంగా ఇప్పుడు దేశంలో సౌత్ సినిమా హవా నడుస్తోంది కాబట్టే జాతీయ అవార్డుల్లో అంత ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొందన్నది వాస్తవం.

This post was last modified on July 23, 2022 10:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

3 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

5 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

5 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

6 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

7 hours ago