కళ్యాణ్ హీరోగా స్వీయ నిర్మాణంలో వసిష్ట అనే దర్శకుడిని పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ‘బింబిసార’ రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పటికే ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అక్కడి నుండి టీం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు కానీ క్లిక్ అవ్వట్లేదు. ఇక సినిమా మీద భారీ బజ్ రావాలంటే ఏదో పెద్దగా ప్లాన్ చేయాలి. ప్రెజెంట్ కళ్యాణ్ రామ్ అదే ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తుంది.
ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ఆగస్ట్ 5న సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది. నైజాంలో దిల్ రాజు డీల్ క్లోజ్ చేసుకున్నారు. మిగతా ఏరియాలు క్లోజ్ అవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో ఓ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి దానికి రాజమౌళి, ఎన్టీఆర్ లను గెస్టులుగా తీసుకురావడానికి కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
నిజానికి కళ్యాణ్ రామ్ ఓ మోస్తరు కథతో సినిమా చేస్తేనే ఎన్టీఆర్ ఈవెంట్ లో వాలిపోతాడు. అలాంటిది తన అన్నయ్య భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ తీస్తే రాకుండా ఉంటాడా ? కళ్యాణ్ రామ్ పిలవకుండా ఉంటాడా ? కానీ ఎన్టీఆర్ తో పాటు జక్కన్న కూడా ఆ ఈవెంట్ కి వస్తే సినిమాకు హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ ఓ ఇబ్బంది ఉంది. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళి పై కోపంగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ హీరోకి కథలో పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఓ డిస్కషన్ లేవదీసి జక్కన్న ని తిట్టిపోశారు.
ఇక ఎన్టీఆర్ కూడా ఆ తర్వాత రాజమౌళిని కలిసినట్టు ఎలాంటి పోస్టులు పెట్టకపోవడంతో తారక్ కూడా రాజమౌళి పై కాస్త అక్కసుగా ఉన్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ ఎన్టీఆర్ , రాజమౌళి కలిసి మీడియా ముందుకు వస్తే మేటర్ క్లోజ్ అవుద్ది. అలాగే కళ్యాణ్ రామ్ సినిమాకు మంచి ప్రమోషన్ దక్కుతుంది. మరి చూడాలి ఎన్టీఆర్ తో కలిసి జక్కన్న ఈవెంట్ కి వస్తారా ?
This post was last modified on July 22, 2022 10:10 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…