నాగ చైతన్య తో దిల్ రాజు ఎట్టకేలకు రెండో సినిమా చేశాడు. అక్కినేని కుర్ర హీరోని ‘జోష్’ తో హీరోగా లాంచ్ చేసిన దిల్ రాజు ఆ సినిమా తర్వాత చైతూ ఇంత వరకూ చేయలేదు. అతనికి సూపర్ హిట్ ఇచ్చే కథ కోసం ఇన్నాళ్ళు వేచి చూశారు. రైటర్ కం డైరెక్టర్ బీవీఎస్ రవి ఓ లైన్ చెప్పగానే ఎగ్జైట్ అయ్యాడు. వెంటనే స్క్రిప్ట్ రెడీ చేయించి దాన్ని ఫైనల్ గా విక్రమ్ కే కుమార్ చేతిలో పెట్టారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు సంబంధించి ఎక్కడా నాగార్జున కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా నాగ్ హాజరు కాలేదు. అదే ఇప్పుడు అందరిలో డౌట్ క్రియేట్ చేస్తోంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అక్కినేని అభిమానులు నాగార్జున ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకురావాలని అడిగారు. దానికి చైతు పర్మీషణ్ తీసుకోకుండా మాకు ఒకే చైతూ కి కూడా ఓకె. నాగార్జున గారు వస్తారు అన్నట్టుగా మాట ఇచ్చారు. కానీ తీసుకురాలేకపోయారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ కి ముందు నాగ్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో జస్ట్ కనిపించి ఉంటే ఎలాంటి డిస్కషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు నాగ్ రాలేదు కాబట్టి రిజల్ట్ ఆయనకీ ముందే తెలిసిపోయిందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
సినిమా టాక్ ఎలా ఉన్నా చైతన్య కి మంచి మార్కులు పడ్డాయి. మూడు లుక్స్ తో బాగా నటించాడని మాట్లాడుకుంటున్నారు. ఇక రేపో మాపో యూనిట్ ఎలానో ఓ సక్సెస్ మీట్ పెట్టి ఆడియన్స్ కి థాంక్యూ చెప్పుకుంటారు. మరి అక్కడైనా నాగ్ కనిపిస్తారా ? ఒకవేళ నాగ్ సక్సెస్ మీట్ కి వచ్చి దిల్ రాజు కి ఫార్మాలిటీకీ అయినా థాంక్యూ చెప్తే ఇక ఎలాంటి డిస్కషన్స్ ఉండవు. లేదంటే చైతూ థాంక్యూ సినిమా చేయడం నాగ్ ఇష్టం లేదేమో అన్న ప్రశ్నలు ఇలానే కొనసాగుతాయి.
This post was last modified on July 22, 2022 7:59 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…