Movie News

భారీ చిత్రం.. డిజాస్టర్ టాక్, ఓపెనింగ్స్

బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు రణబీర్ కపూర్. 2018లో విడుదలైన అతడి చివరి సినిమా ‘సంజు’ అప్పట్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఖాన్ త్రయానికి దీటైన స్టార్‌గా రణబీర్ అవతరించాడు ఆ చిత్రంతో. ఆ సినిమా ఫలితం చూసే రణబీర్‌తో షంషేరా, బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాలు లైన్లో పెట్టారు దర్శక నిర్మాతలు.

‘షంషేరా’ ట్రైలర్ చూస్తే అందులోని భారీతనం అర్థమవుతుంది. ‘బాహుబలి’తో దానికి పోలికలు కనిపించాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ రూ.150 కోట్ల బడ్జెట్లో తీసిన సినిమా ఇది. కరణ్ మల్హోత్రా దర్శకుడు. కొవిడ్ కారణంగా ఈ చిత్ర మేకింగ్, రిలీజ్ ఆలస్యమై.. ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘షంషేరా’ థియేటర్లలోకి దిగింది. కానీ ఈ చిత్రానికి టాక్, ఓపెనింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. బాలీవుడ్లో మరో పెద్ద డిజాస్టర్‌గా ‘షంషేరా’ నిలవబోతుందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.

నార్త్ ఇండియాలో ‘షంషేరా’కు ఉదయం 7 గంటలకే షోలు పడ్డాయి. దీంతో ఉదయం 10 గంటలకే టాక్ బయటికి వచ్చేసింది. ఇటు క్రిటిక్స్, అటు ప్రేక్షకులు సినిమా గురించి పూర్తి నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. ఒక క్రిటిక్ అయితే గత పదేళ్లలో ఇంత బోరింగ్ సినిమా ఇంకోటి రాలేదని.. ఇదొక టార్చర్ మూవీ అని ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు. చాలామంది క్రిటిక్స్ నెగెటివ్ రివ్యూలే ఇస్తున్నారు.
ఇక సామాన్య ప్రేక్షకుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా చాలా బ్యాడ్‌గా ఉంది. సినిమా డిజాస్టర్ అని అందరూ తీర్మానించినట్లే ఉన్నారు. ‘బాహుబలి’ని అనుకరించే ప్రయత్నంలో కరణ్ మల్హోత్రా తుస్సుమనిపించాడని.. రణబీర్ పెర్ఫామెన్స్ మినహాయిస్తే సినిమాలో ఏదీ ఆకట్టుకోలేదని అంటున్నారు.

కొవిడ్ తర్వాత బాలీవుడ్ మార్కెట్ ఎంతగా దెబ్బ తిందో తెలిసిందే. పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఓపెనింగ్స్ దారుణంగా వస్తున్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఫలితం లేకపోతోంది. అలాంటిది బ్యాడ్ టాక్‌తో మొదలైన ‘షంషేరా’ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.

ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రం కాగా.. తొలి రోజు బ్యాడ్ టాక్ రావడం, వర్షాల ప్రభావంతో పరిస్థితి ఘోరంగా ఉంది. రణబీర్ సినిమాకు ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందంటే సినిమా ఫలితం ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

This post was last modified on July 22, 2022 2:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మన దేశం పౌరసత్వం కోసం అతను చేసింది త్యాగమే

విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్‌షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్‌పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…

4 hours ago

అవతార్ నిప్పులను తక్కువంచనా వేయొద్దు

ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…

5 hours ago

మురారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే

ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…

6 hours ago

అమెరికాలో బిర్యానీ లవర్స్‌కు షాక్ తప్పదా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…

7 hours ago

`వేమిరెడ్డి` వేడి.. వైసీపీని ద‌హిస్తుందా.. !

రాజ‌కీయంగా ప్ర‌శాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ టార్గెట్ చేయ‌లేదు. త‌న స‌తీమ‌ణి,…

8 hours ago

తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ లో ఏముంది?

తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. స్వ‌ప్నిస్తున్న తెలంగాణ విజ‌న్ డాక్యుమెంటును తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఫ్యూచ‌ర్…

8 hours ago