టాలీవుడ్లో ఏడాది ముందు వరకు బెస్ట్ కపుల్ ఎవరు అంటే నాగచైతన్య-సమంతలనే చూపించేవారు మెజారిటీ జనాలు. ప్రేమికులుగా ఉన్నపుడు.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక ఈ జంట అంత అన్యోన్యంగా కనిపించింది. అలాంటి జంట విడిపోతుందని.. విడాకులు తీసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. సామాన్యులే కాదు.. టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఈ విషయంలో షాకయ్యారు. విడాకులకు కారణమేంటి.. ముందు విడిపోవాలని కోరుకన్నది ఎవరు.. అనే విషయంలో చాలా చర్చ జరిగింది ఇప్పటికే.
ఈ వ్యవహారంపై ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగాకానీ.. చైతూ ఏమీ స్పందించలేదు ఇప్పటిదాకా. ఒక సందర్భంలో మాత్రం ఈ నిర్ణయం వల్ల తామిద్దరం హ్యాపీగా ఉన్నట్లు ఒక కామెంట్ చేశాడంతే. సమంత మాత్రం పరోక్షంగా విడాకుల విషయంలో తన ఫ్రస్టేషన్ చూపించిన సంకేతాలు కనిపించాయి. మీడియా వాళ్లు ఈ విషయంపై అడిగినపుడు అసహనానికి గురవడం.. సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ పోస్టులు పెట్టడం.. విడాకుల విషయంలో తన గురించి జరిగిన వ్యతిరేక ప్రచారాన్ని ఖండించడం చేసిందామె.
ఐతే చైతూ నుంచి విడిపోయాక ఎక్కడా కూడా అతడి పేరెత్తడానికి సమంత ఇష్టపడకపోవడం గమనార్హం. తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో చైతూ విషయం వచ్చినపుడు సమంత స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరణ్ జోహార్ పెళ్లి, విడాకుల గురించి స్పందిస్తూ మీ భర్త అంటూ చైతూ గురించి ప్రస్తావించాడు. దీనికి వెంటనే రియాక్టయిన సమంత.. ‘‘మాజీ భర్త’’ అని కరెక్ట్ చేయడం, కరణ్ సర్దుకుని ‘‘అవును మాజీ భర్త’’ అంటూ తన ప్రశ్నను కొనసాగించడం గమనార్హం. ఏదో మాట వరసకు భర్త అంటే.. సమంత అంత సీరియస్‌గా రియాక్టవ్వాల్సిన అవసరం ఏంటి.. చైతూ విషయంలో ఆమె అంత కోపంతో ఉందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఈ వీడియో చూసి.
ఇదిలా ఉండగా.. తన కొత్త చిత్రం ‘థాంక్యూ’ ప్రమోషన్లలో భాగంగా సమంత గురించి చైతూ స్పందించిన తీరు ఆసక్తికరం. మీతో బాగా కెమిస్ట్రీ పండిన హీరోయిన్ ఎవరు అని అడిగితే.. ‘లవ్ స్టోరి’లో తనకు, సాయిపల్లవికి కెమిస్ట్రీ బాగా పండిందని.. ఇక తాను, సామ్ కలిసి చేసిన లవ్ స్టోరీలన్నీ ది బెస్ట్ అనిపించాయని చాలా క్యాజువల్‌గా చెప్పాడు చైతూ. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా సామ్ పేరు పక్కన పెట్టకుండా చైతూ ఆమె గురించి స్పందించిన తీరు.. మరోవైపు కరణ్ ప్రోగ్రాంలో చైతూ గురించి సామ్ రెస్పాండైన విధానం పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం.
This post was last modified on July 22, 2022 2:41 pm
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…