ఒక సినిమాకు సంబంధించి ఏదైనా ప్రోమో రిలీజ్ చేసి దాని మీద సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు కనిపిస్తే ఆ చిత్ర బృందం భయపడుతుంది. కంగారు పడుతుంది. నెగెటివిటీని అధిగమించడానికి ఏం చేయాలా అని చూస్తుంది. తర్వాత రిలీజ్ చేసే ప్రోమోల విషయంలో జాగ్రత్త పడుతుంది. కానీ ‘లైగర్’ టీం మీద దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఏ విశేషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నా.. భారీ ఎత్తున స్పందన వస్తోంది. కానీ ఆ స్పందనలో చాలా వరకు నెగెటివ్‌గా ఉంటుండడం గమనార్హం.
టైటిల్ ప్రకటించినపుడు.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినపుడు.. టీజర్ లాంచ్ చేసినపుడు.. ఇలా ప్రతిసారీ ఎక్కువగా సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల విజయ్ నగ్న చిత్రంతో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే దాని మీద ఒక రేంజిలో ట్రోలింగ్ జరిగింది. కానీ ఈ విషయంలో విజయ్ అండ్ టీం అసలు కంగారు పడట్లేదు. తమను ఎంత తిడితే అంత పబ్లిసిటీ అన్నట్లే చూస్తోంది.
విజయ్‌ని నెటిజన్లు పొగడొచ్చు లేదా తిట్టొచ్చు.. కానీ అతణ్ని విస్మరించలేరు అన్నది అతడి టీం ఉద్దేశంలా కనిపిస్తోంది. ఇప్పుడు రిలీజైన ‘లైగర్’ ట్రైలర్ విషయంలోనూ సోషల్ మీడియా నుంచి విపరీతమైన నెగెటివ్ కామెంట్లు కనిపిస్తున్నాయి. ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేదని.. హీరో క్యారెక్టరైజేషన్.. సన్నివేశాలు అన్నీ కూడా టూమచ్‌గా ఉన్నాయని.. విషయం తక్కువ హడావుడి ఎక్కువ అన్న తరహాలో కనిపిస్తోందని కామెంట్లు పడుతున్నాయి. కానీ పూరి చివరి సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలు రిలీజ్ చేసినపుడు కూడా ఇలాంటి రెస్పాన్సే కనిపించింది. కానీ ఆ నెగెటివిటీ సినిమాకు మంచి పబ్లిసిటీ తెచ్చి పెట్టింది.
ఇప్పుడు పూరికి విజయ్ తోడవడంతో సోషల్ మీడియాలో వీరి సినిమా మీద రెస్పాన్స్ మరింత ఎక్కువగా ఉంది. నెగెటివ్ కామెంట్లకు లెక్కే లేకుండా పోతోంది. కానీ ఇవేవీ చిత్ర బృందాన్ని కంగారు పెట్టట్లేదు. ఈ రోజుల్లో నెగెటివిటీనే సినిమాకు ప్లస్ అని, దాని వల్ల వచ్చే పబ్లిసిటీనే ఎక్కువ అని.. రేప్పొద్దున ఓపెనింగ్స్‌కు అది బాగా ఉపయోగపడుతుందని ‘లైగర్’ టీం నమ్ముతున్నట్లుగా కనిపిస్తోంది.
This post was last modified on July 22, 2022 9:05 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…