Movie News

రేపు రిలీజ్.. ఈ రోజు బాయ్‌కాట్ ట్రెండింగ్

బాలీవుడ్లో పెద్ద స్టార్ల సినిమాలు రిలీజైనపుడల్లా వాటి బాయ్‌కాట్ చేయమంటూ సోషల్ మీడియాలో ట్రెండ్స్ నడవడం మామూలైపోతోంది. రెండు వర్గాలు అదే పనిగా కొన్ని చిత్రాలను టార్గెట్ చేస్తుండడం గమనార్హం. అందులో హిందుత్వ మద్దతుదారులు ఒక వర్గం అయితే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు ఇంకో వర్గం. బాలీవుడ్లో ఎప్పుడూ హిందూ వ్యతిరేక సినిమాలే వస్తుంటాయన్నది ఒక వర్గం కంప్లైంట్ అయితే.. కొందరు స్టార్లు, అలాగే నెపో కిడ్స్ కారణంగానే సుశాంత్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడంటూ ఇంకో వర్గం ఆరోపణ.

ఈ నేపథ్యంలో హిందీలో ఈ రెండు వర్గాలకు నచ్చని హీరోల సినిమాలు రిలీజైనపుడల్లా నెగెటివ్ ట్రెండ్స్‌కు దిగుతున్నారు. తాజాగా అలా వారి టార్గెట్‌గా మారిన సినిమా.. షంషేరా. బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

సుశాంత్ సింగ్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించే హీరోల్లో రణబీర్ ఒకడు. పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న ఇలాంటి వాళ్లు సుశాంత్‌ను తొక్కేసి అతడి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని వాళ్లు ఆరోపిస్తుంటారు. ఇక రణబీర్ గతంలో హిందూ వ్యతిరేక కామెంట్లు చేశారంటూ ఇంకో వర్గం అతడిని టార్గెట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి #BoycottShamshera అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. సినిమా శుక్రవారం రిలీజవుతుండగా.. ముందు రోజు ఈ హ్యాష్ ట్యాగ్ ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

రణబీర్ గతంలో తాను ధోతీ ధరించే సినిమా ఏదీ చేయబోనంటూ కామెంట్ చేయడాన్ని హిందూ మద్దతుదారులు తప్పుబడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి కంప్లైంట్లు మరికొన్ని ఉన్నాయి వారి నుంచి. ఇక సుశాంత్ అభిమానులైతే ఇంకా తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అసలే హిందీ చిత్రాల పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటే.. ఇలాంటి నెగెటివ్ ట్రెండ్స్‌తో మరింత డ్యామేజ్ జరుగుతోందన్నది వాస్తవం.

This post was last modified on July 22, 2022 9:01 am

Share

Recent Posts

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

22 minutes ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

31 minutes ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

53 minutes ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

1 hour ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

3 hours ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

3 hours ago