మాములుగా వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా సినిమా వస్తోందంటే దాని హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ప్రమోషన్లు పీక్స్ లో ఉంటాయి. హీరో దర్శకుడు బయటికి వచ్చి అడిగిన మీడియాకల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్ ని పెంచే ప్రయత్నం చేస్తారు. అది ఆర్ఆర్ఆర్ కావొచ్చు లేదా లైగర్ అవ్వొచ్చు. ఏదైనా సరే పబ్లిసిటీ ముఖ్యం బిగిలూ తరహాలో ప్రచారానికి దిగాల్సిందే. కానీ విచిత్రంగా తమిళంలో తీసి అన్ని ప్రధాన భాషల్లో ఈ నెల 28న రాబోతున్న ది లెజెండ్ కేసు మాత్రం చాలా వెరైటీగా ఉంది.
వేల కోట్ల వ్యాపారాలతో బిజినెస్ టైకూన్ గా పేరున్న శరవణన్ హీరోగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఆల్రెడీ మీమ్స్ చేసే వాళ్లకు మంచి స్టఫ్ మెటీరియల్ గా మారిపోయింది. ఒక్కొక్కటిగా వీడియో సాంగ్స్ బయటికి వస్తున్నాయి. కలర్ఫుల్ సెట్లు, ప్రొడక్షన్ లో గ్రాండియర్ చూసి జనాలు ఆమ్మో అనుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ సినిమాలో చూపించింది అసలు హీరోనేనా లేక ముఖం, శరీరం గట్రా గ్రాఫిక్స్ లో తయారు చేయించారానే అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగానే విజువల్స్ చూస్తే ఆ డౌట్ రావడం ఖాయం.
విచిత్రంగా శరవణన్ ఎక్కువగా బయటికి రావడం లేదు. ముఖ్యంగా తెలుగు కన్నడ మలయాళంలో ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఈవెంట్లు చేయలేదు. చెన్నైలో ఒకటి చేశారు కానీ వ్యక్తిగతంగా ఫోజులు ఇవ్వడానికి శరవణన్ ఇష్టపడలేదు. కెమెరామెన్లు దూరం నుంచే తీసుకుని సర్దుకున్నారు. మాములుగా శరవణన్ ది అంత తెల్లగా ఉండే ఛాయ కాదు. కానీ సినిమాలో మాత్రం మహేష్ బాబు రేంజ్ లో మెరిసిపోతున్నాడు. ఈ రహస్యం ఏమిటో బయటి ప్రపంచానికి చెబితే బాగుంటుంది. కానీ అసలు ఆ ఒరిజినల్ హీరో బయటికి వస్తేగా.
This post was last modified on July 21, 2022 7:21 pm
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…
తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్…