ఎప్పుడో మార్చిలో విడుదలైన ఆర్ఆర్ఆర్ తాలూకు వైబ్రేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికన్నా వంద కోట్లు ఎక్కువ వసూలు చేసి పన్నెండు వందల ఫిగర్ తో టాప్ లో నిల్చున్న కెజిఎఫ్ 2ని అందరూ మర్చిపోయారు కానీ ట్రిపులార్ మాత్రం ఇంకా చర్చల్లో ఏదో రూపంలో నానుతూనే ఉంది. ,ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ వచ్చాక దీని రచ్చ మాములుగా లేదు. డాక్టర్ స్ట్రేంజ్ రచయితతో మొదలుపెట్టి బడా సాఫ్ట్ వేర్ కంపెనీల సిఈఓల దాకా అందరూ పొగడ్తల వర్షంలో ముంచెత్తినవారే. తాజాగా మరో ఘనత వచ్చి చేరింది.
ఇండియన్ వెర్షన్ రిలీజైన ఏడు నెలల తర్వాత ఆర్ఆర్ఆర్ జపాన్లో ఈ అక్టోబర్ 21న విడుదల కాబోతోంది. ఇందులో విశేషమేంటి అనుకుంటున్నారా. చాలా ఉందండోయ్. ఈ సినిమా ఎంత ఆన్ లైన్లో వచ్చినా ఇప్పటిదాకా ఆ దేశవాసులు చూసే అవకాశం దక్కలేదు. ఎందుకంటే అక్కడ పైరసీ ఉండదు. అన్ని ఓటిటిలు అందుబాటులో లేవు. ఏదైనా పరభాషా చిత్రం రావాలంటే దానికి సంబంధించి బోలెడు ఫార్మాలిటీస్ ఉంటాయి. అవన్నీ పూర్తయ్యేసరికి నెలలు గడిచిపోతాయి. గతంలో బాహుబలికీ ఈ తిప్పలు తప్పలేదు.
సో జక్కన్న మేజిక్ జపాన్ లోనూ పని చేయడం ఖాయం. ఎందుకంటే అక్కడి ప్రేక్షకులు గ్రాఫిక్స్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ కి పెద్ద పీఠ వేస్తారు. నచ్చితే చాలు వేల కోట్ల వసూళ్ల రూపంలో కుమ్మరిస్తారు. ఆర్ఆర్ఆర్ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో వరల్డ్ వైడ్ లెక్కలో భారీ మార్పు రాబోతోంది. ఇదంతా ఒక ఎత్తయితే చైనాలోనూ విడుదల దక్కించుకుంటే ఇప్పట్లో రాజమౌళిని ఎవరూ టచ్ చేయలేరు కూడా.
This post was last modified on July 21, 2022 7:01 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…