త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్నేళ్లుగా హారిక హాసిని సంస్థకు కట్టుబడి, తన సినిమాలన్నీ వాళ్ళకే చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తో సినిమా అంటే హారిక హాసినికే చేయాల్సి వస్తోందని హీరోలు కొత్త పద్ధతి కనిపెట్టారు.
త్రివిక్రమ్ తో చేసే సినిమాకు తమ సొంత సంస్థకు కూడా వాటా కావాలని లింక్ పెడుతున్నారు. అల వైకుంఠపురములో తర్వాత ఎన్టీఆర్ 30వ చిత్రానికి కూడా అదే ఫాలో అవుతున్నారు.
త్రివిక్రమ్ ఈ సంస్థకు స్క్రిప్ట్ సలహాలు, ఎడిటింగ్ లో సూచనలు కూడా ఇస్తుంటాడు. ఒక రకంగా ఆ సంస్థలో అన్నీ ఆయనే. మైత్రి మూవీ మేకర్స్ కూడా అలా కొరటాల శివను పెద్ద దిక్కుగా పెట్టుకున్నారు.
మొన్నామధ్య వరుస పరాజయాలు రావడంతో కొరటాల శివ సలహా సంప్రదింపులు లేకుండా ఏ సినిమా మొదలు పెట్టకూడదని డిసైడ్ అయ్యారు. సర్కారు వారి పాట కథ విని ఆ కథను మహేష్ కి సిఫార్సు చేసింది కూడా కొరటాల శివేనట. ఆచార్య ముగిసిన తర్వాత ఈ సంస్థకే కొరటాల మలి చిత్రం చేస్తాడని టాక్.
This post was last modified on July 10, 2020 8:45 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…