ఇండస్ట్రీలో రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి. అందులో రిలీజ్ డేట్ సెంటిమెంట్ అనేది చాలా ప్రదానంగా చూస్తుంటారు. ఫలానా బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ డేట్ కి మా సినిమా విడుదల అంటూ చెప్పుకుంటారు కూడా. ఇక నందమూరి బాలయ్య గురించి చెప్పనక్కర్లేదు. ముహూర్త బలాలు , తేదీలు బాగా చూసుకుంటారు. పైగా సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో తన అప్ కమింగ్ సినిమాకు రిలీజ్ డేట్ ఖరారు చేస్తునట్లు తెలుస్తుంది. గతేడాది డిసెంబర్ 2న బాలయ్య ‘అఖండ’ రిలీజైంది. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. సెకండ్ వేవ్ తర్వాత తెలుగు సినిమాలకు ఊపు ఉత్సాహం ఇచ్చిన సినిమాగా అఖండ గురించి చాలా నెలలు మాట్లాడుకున్నారు. అందుకే ఇప్పుడు అదే డేట్ కి గోపీచంద్ మలినేని తో చేస్తున్న NBK107 ని రిలీజ్ చేయాలని బాలయ్య డిసైడ్ అయ్యారని తెలుస్తుంది.
లక్కీ గా ఈ డిసెంబర్ 2న శుక్రవారం వస్తుంది. అంటే వీకెండ్ ఇబ్బంది కూడా లేనట్టే. అందుకే బాలయ్య అన్నీ చూసి ఈ ముహూర్తం ఫిక్స్ చేశారని టాక్. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ మూవీ మీద అటు నందమూరి అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. అఖండ తర్వాత బాలయ్య , క్రాక్ తర్వాత గోపీచంద్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ట్రేడ్ పరంగానూ సినిమా మంచి మార్కెట్ చేసుకోనుంది. తాజాగా కొన్ని ఏరియాలకు సంబంధించి ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ లాక్ అయినట్టు ఇన్ఫో.
ఏదేమైనా సంక్రాంతి కి ముందు వచ్చే డిసెంబర్ కూడా సినిమాలకు మంచి సీజన్ అని చెప్పొచ్చు. ఆ నెలలో కాస్త హిట్ టాక్ తెచ్చుకున్నా హాలిడేస్ కూడా వర్కౌట్ అవుతాయి. సినిమా ఏ మాత్రం బాగున్నా సంక్రాంతి వరకూ లిమిటెడ్ థియేటర్స్ లో ఆడే అవకాశం ఉంది. ఓటీటీలో పది వారాల వరకూ రాకపోతే బాలయ్య సినిమాకు ఇంకా కలిసోస్తుంది.
This post was last modified on July 20, 2022 10:01 pm
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…