విక్రమ్ ప్రభు డైరెక్షన్ లో నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటివలే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ విషయం బయటపెట్టాడు చైతు. సినిమాలో నేను పోలీస్ కేరెక్టర్ చేస్తున్నాను అంటూ ఇది పోలీస్ కథతో తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా అని చెప్పేశాడు. దీంతో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ లో భయం మొదలైంది. దీనికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఈ మధ్యే రామ్ తమిళ దర్శకుడితో ‘వారియర్’ అంటూ ఓ పోలీస్ కథతో యాక్షన్ సినిమా చేశాడు. ఆ సినిమా రిజల్ట్ ఏమైందో తెలిసిందే. అందుకే తమిళ దర్శకుడితో పోలీస్ గా చైతు సినిమా అంటే ఇప్పుడు వారిలో టెన్షన్ స్టార్టయింది.
నిజానికి కాప్ యాక్షన్ డ్రామాలకు కాలం చెల్లింది. కంటెంట్ ఎక్స్ట్రార్డినరి గా ఉంటే తప్ప వర్కౌట్ అవ్వదు. కేజీఎఫ్ 2, విక్రమ్ వంటి అల్టిమేట్ యాక్షన్ సినిమాలు చూసిన కళ్ళకు ఇప్పుడు రెగ్యులర్ రొటీన్ యాక్షన్ సినిమాలు ఆనవు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇంకో విషయం ఏమిటంటే వారియర్ కి , ఇప్పుడు చైతు సినిమాకి రెండు చిత్రాలకు కోలీవుడ్ దర్శకులు కావడం. పైగా రెండు సినిమాల్లో కృతి శెట్టినే హీరోయిన్ కూడా… పోలీస్ కథ , తమిళ దర్శకుడు , సేమ్ హీరోయిన్ ఈ కంపెరిజన్స్ అక్కినేని ఫ్యాన్స్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం చైతూ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఈ టైంలో రొటీన్ యాక్షన్ సినిమాతో దెబ్బ తింటే కెరీర్ డౌన్ అవుతుంది. వెంకట్ ప్రభు మంచి దర్శకుడే కానీ ఆయనతో ఏదైనా రీమేక్ సినిమా కాకుండా ఇలా యాక్షన్ సినిమా చేయడం అంటే చైతు రిస్క్ చేస్తున్నట్లే. మరి వారియర్ రిజల్ట్ తన బైలింగ్వెల్ సినిమాకు రిపీట్ అవ్వకుండా చైతూ కాస్త జాగ్రత్త తీసుకుంటే బెటర్.
This post was last modified on July 20, 2022 9:58 pm
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…