తెలుగు, తమిళ భాషల్లో ఒక దశాబ్దం పాటు టాప్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. అడపా దడపా ఆమె హిందీలో కూడా పెద్ద సినిమాలే చేసింది కానీ.. అవేవీ ఆమెకు ఆశించిన ఫలితాలివ్వలేదు. గత కొన్నేళ్లలో దక్షిణాదిన కూడా ఆమె హవా తగ్గిపోయింది. తన రేంజ్ బాగా తగ్గించుకుని చిన్న-మీడియం స్థాయి సినిమాలు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అలా అని ఆమె సినిమాలైతే ఆపేయలేదు. బహు భాషల్లో ఆమె సినిమాలు చేస్తూనే ఉంది.
తాజాగా తమన్నా హిందీలో ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరైన సీనియర్ దర్శకుడు మాధుర్ బండార్కర్ రూపొందించిన చిత్రమిది. కరోనాకు ముందే అనౌన్స్ అయిన ఈ చిత్రం మేకింగ్ ఆలస్యమై.. రిలీజ్ కూడా లేటైంది. ఎట్టకేలకు ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాకపోతే థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో ఈ చిత్రాన్ని దించేస్తున్నారు.
‘బబ్లీ బౌన్సర్’ను హాట్ స్టార్ ఓటీటీలో సెప్టెంబరు 23న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మధ్య హిందీ చిత్రాలకు థియేటర్లలో ఎదురవుతున్న పరాభవాల గురించి తెలిసిందే. పేరున్న హీరోలు నటించిన సినిమాలు కూడా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్ లాంటి స్టార్లు నటించిన సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా బోల్తా కొట్టాయి. ముఖ్యంగా క్లాస్ టచ్ ఉన్న సినిమాలకు అస్సలు ఓపెనింగ్స్ రావట్లేదు.
ఇలాంటి టైంలో తమన్నా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసే సాహసం చేయలేకపోయినట్లున్నాడు మాధుర్ బండార్కర్. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎక్కువ రేటు కూడా వస్తుంది కాబట్టి ఆ మార్గాన్నే ఎంచుకున్నట్లున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా మాధురే కావడం విశేషం. హిందీతో పాటు తమన్నాకు మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళం, తెలుగు భాషల్లోనూ ‘బబ్లీ బౌన్సర్’ రిలీజ్ కాబోతోంది. మరి ఒకప్పుడు క్లాసిక్స్ తీసిన మాధుర్.. తమన్నాతో ఎలాంటి సినిమా అందించాడో చూడాలి.
This post was last modified on July 20, 2022 9:52 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…