పుష్పలో ఐటెం సాంగ్ చేశాక మరింత బిజీ అయిపోయిన సమంతాకు ఆఫర్లు మాత్రం ఆగడం లేదు. ఒకపక్క సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఇండిపెడెంట్ ఫిలింస్, టాక్ షోలు, ఇంటర్వ్యూలు ఇలా అన్ని రకాలుగా బిజీగా మారిపోయింది. త్వరలో తమిళంలో రూపొందబోయే విజయ్ సినిమాలో తనే హీరోయిననే ప్రచారం చెన్నై మీడియాలో జోరుగా సాగింది. విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో స్కై హైలో ఉన్న లోకేష్ కనగరాజ్ దీనికి దర్శకుడు. ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు కానీ వారసుడు పూర్తయ్యేలోపు లోకేష్ స్క్రిప్ట్ ఫైనల్ చేసేయాలి.
ఇక్కడే ఓ ట్విస్టు ఉంది. అందరూ అనుకున్నట్టు సామ్ ఇందులో హీరోయిన్ కాదట. నెగటివ్ షేడ్స్ లో సాగే పోలీస్ ఆఫీసర్ గా చాలా కొత్తగా కనిపించనుందట. పాత్ర తీరుతెన్నులు చెప్పగానే సమంతా ఆల్మోస్ట్ ఓకే చేసినట్టు సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ 2లో ఆల్రెడీ చేసిన అనుభవం ఉంది. అందులో ఆడియన్స్ తనను బాగా రిసీవ్ చేసుకున్నారు. సో విలన్ టచ్ ఉన్న క్యారెక్టర్ కొత్తేమి కాదు. అయితే నరసింహలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి అంత వెయిటేజ్ ఉంటేనే ఇలాంటివి కెరీర్ పరంగా ఉపయోగపడతాయి.
విజయ్ తో గతంలో సామ్ మూడుసార్లు జోడిగా నటించింది. కత్తి, పోలీసోడు, అదిరింది మూడు తమిళంలో ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్లు. తెలుగులోనూ ఓ మాదిరిగా ఆడాయి. యశోద, శాకుంతలం లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ తో పాటు ఖుషి లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఒకేసారి చేస్తున్న సమంతా ఖాకీ డ్రెస్సులో విలనిజం చూపించడం రిస్క్ తో కూడిన వెరైటీ అవుతుంది. కాఫీ విత్ కరణ్ ఓటిటి టాక్ షోలో మెరవనున్న సామ్ కు రాబోయే ఆరు నెలల్లో కనీసం మూడు నాలుగు రిలీజులు ఉండబోతున్నాయి.
This post was last modified on July 20, 2022 7:03 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…