కెరీర్ మొదలుపెట్టి ఆరేళ్ళు దాటుతున్నా ఇప్పటిదాకా యాక్షన్ జానర్ ని టచ్ చేయని అఖిల్ కు ఏజెంట్ మీద భారీ అంచనాలున్నాయి. బాడీని విపరీతంగా కష్టపెట్టి బిల్డ్ చేసుకుని చాలా రిస్క్ చేసి మరీ ఫైట్లు గట్రా చేయడంతో ఇది హిట్ కావడం తనకు చాలా కీలకం. సరిగ్గా గురి కుదిరితే దెబ్బకు ప్యాన్ ఇండియా లెవెల్ లో సెటిలైపోవచ్చు. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా మంచి కసి మీదున్నాడు. సైరా నరసింహారెడ్డికి ఆశించిన ఫలితం దక్కపోవడంతో తిరిగి తన కమర్షియల్ జానర్ కు వచ్చేసాడు. బ్లాక్ బస్టర్ పడాల్సిందే.
కీలకమైన రిలీజ్ డేట్ విషయంలోనే యూనిట్ ఎటూ తేల్చుకోలేకపోతోందని వినికిడి. అప్పుడెప్పుడో ఆగస్ట్ 12 ఫిక్స్ చేశారు. కట్ చేస్తే పోస్ట్ ప్రొడక్షన్ పనులతో కొంత భాగం షూటింగ్ పెండింగ్ ఉండిపోయింది. హడావిడి చేసి తొందరపడటం ఎందుకని సరైన డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. దసరా అనుకుంటే ఆల్రెడీ నాన్న నాగార్జున ది ఘోస్ట్ అక్టోబర్ 5 కర్చీఫ్ వేసేసింది. చిరంజీవి గాడ్ ఫాదర్ సైతం ముందో వెనకో అదే పండక్కు రావడం ఖాయం. అలాంటప్పుడు అఖిల్ నేరుగా వీటిని ఢీ కొట్టలేడు. సో వేరే ఆప్షన్ చూసుకోవాల్సిందే.
పోనీ నవంబర్ వెళదామంటే అదేమంత రైట్ టైం కాదు. అందుకే అక్కినేనికి బాగా కలిసి వచ్చిన డిసెంబర్ కే ఏజెంట్ ని ఫిక్స్ చేయాలని అఖిల్ అడుగుతున్నాడట. మాస్, మన్మథుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఆ సమయంలోనే గొప్ప విజయాలు అందుకున్నాయి. ముఖ్యంగా మూడు లేదా నాలుగో వారం అనుకూలంగా ఉంటుంది. అయితే అవతార్ 2తో పాటు రణ్వీర్ సింగ్ సర్కస్ లు ఆల్రెడీ క్రిస్మస్ రేస్ లో ఉన్నాయి. సో ఏజెంట్ ని దించే ముందు వీటి ప్రభావం ఎంత ఉంటుందనేది చెక్ చేసుకోవాలి. సో ఏజెంట్ కిది పెద్ద సవాలే.
This post was last modified on July 20, 2022 6:55 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…