ఆర్ఆర్ఆర్ లాంటి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆచార్య దారుణంగా డిజాస్టర్ కావడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ శంకర్ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆయనేమీ గొప్ప ఫామ్ లో లేకపోయినప్పటికీ ప్రాజెక్టుకు సంబంధించిన లీక్స్ హైప్ ని పెంచుతుండటంతో విడుదల ఎప్పుడవుతుందాని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యిందని అంటున్నారు కానీ ఎంత శాతం అనేది బయటికి చెప్పడం లేదు. ఇటీవలే పంజాబ్ షెడ్యూల్ ఫినిష్ చేసి షూట్ ని హైదరాబాద్ షిఫ్ట్ చేశారు.
ఇక ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన అప్డేట్స్ ని ఒక్కొక్కటిగా లాక్ చేయబోతున్నారు. అందులో భాగంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని టైటిల్ తో పాటుగా ఆగస్ట్ 15న రిలీజ్ చేయబోతున్నారు. చరణ్ కు ఆ నెంబర్ ఎలాగూ కలిసి వస్తోంది కాబట్టి అలా ప్లాన్ చేస్తున్నారన్న మాట. ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా రివీల్ చేస్తారని తెలిసింది. చాలా ప్రత్యేక అతిథులను శంకర్ తీసుకొస్తున్నట్టు వినికిడి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పొలిటికల్ కం యాక్షన్ ఎంటర్ టైనర్ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయడం దాదాపు ఖాయమే.
మరో ఇంటరెస్టింగ్ అప్ డేట్ ఏంటంటే ఇందులో ఎస్ జె సూర్య ముఖ్యమంత్రి కొడుగ్గా మెయిన్ విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. అధికారం డబ్బు కోసం ఎంత దుర్మార్గానికైనా ఒడిగట్టే పాత్రతో చరణ్ ఢీకొనే సన్నివేశాలు మెయిన్ హై లైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన కొంత చిత్రీకరణ అయిపోయింది. తమన్ కంపోజింగ్ లో ఓ సాంగ్ పిక్చరైజేషన్ జరిగిపోయింది. 2023 సంక్రాంతి బరిలో ఉండటం లేదు కానీ సమ్మర్ సీజన్ లో మాత్రం పక్కాగా వచ్చే ఈ మూవీకి టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదు
This post was last modified on July 20, 2022 3:48 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…